తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Drdo Hyderabad Jobs 2024 : డీఆర్డీవో హైదరాబాద్ లో ఉద్యోగాలు - దరఖాస్తులకు కొన్నిరోజులే గడువు, ఇదిగో లింక్

DRDO Hyderabad Jobs 2024 : డీఆర్డీవో హైదరాబాద్ లో ఉద్యోగాలు - దరఖాస్తులకు కొన్నిరోజులే గడువు, ఇదిగో లింక్

23 October 2024, 14:52 IST

google News
    • హైదరాబాద్‌లోని DRDO నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. రిసెర్చ్ సెంటర్ ఇమారత్‌ (RCI)లో ఖాళీగా ఉన్న రిసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనన్నారు. వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్స్ ను డౌన్లోడ్ చేసుకొని.. స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
డీఆర్‌డీవోలో రిసెర్చ్ ఫెలో ఖాళీలు 2024
డీఆర్‌డీవోలో రిసెర్చ్ ఫెలో ఖాళీలు 2024

డీఆర్‌డీవోలో రిసెర్చ్ ఫెలో ఖాళీలు 2024

హైదరాబాద్‌ డీఆర్డీవోకి అనుబంధంగా ఉండే రిసెర్చ్ సెంటర్ ఇమారత్‌ (RCI)లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరో నాలుగు రోజుల్లో అప్లికేషన్ల గడవు పూర్తి కానుంది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం 22 ఖాళీలు..!

డీఆర్డీవో హైదరాబాద్ నోటిఫికేషన్ వివరాల ప్రకారం… మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. ఇందులో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు మూడు ఉండగా… జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు 19 ఉన్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల కాలపరిమితితో వీటిని భర్తీ చేయనున్నారు. Electronics & Communication ఇంజినీరింగ్ విభాగంతో పాటు ఫిజిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్, కెమికల్, మెటలర్జీ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.

పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో క్లుప్తంగా వివరాలను పేర్కొన్నారు. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంటెక్/ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించి ఉండకూడదు. రిజర్వేషన్ ఉన్నవారికి సడలింపు ఉంటుంది.

దరఖాస్తులను https://www.drdo.gov.in/drdo/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలను పూర్తి చేసి…. ‘ హెడ్ హెచ్ఆర్‌డీ, డాక్టర్ ఏపీజే అబ్దు్ల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌, రిసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ), విజ్ఞాన కంచ, హైదరాబాద్, తెలంగాణ - 500 069’ చిరునామకు పంపించాలి. ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 27వ తేదీన వెలువడింది.

ప్రకటన విడుదలైన నాటి నుంచి 30 రోజులలోపు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. అంటే… అక్టోబర్ 26వ తేదీతో అప్లికేషన్ల గడవు పూర్తి అవుతుంది. ఆన్ లైన్ లేదా మెయిల్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించబడవని అధికారులు స్పష్టం చేశారు.

హైదరాబాద్ ఎన్‌ఎండీసీలో 153 ఉద్యోగాలు :

పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 153 జూనియర్ ఆఫీసర్(ట్రైనీ) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం 10 విభాగాల్లో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా మైనింగ్ విభాగంలో 56 పోస్టులు, ఎలక్ట్రికల్ విభాగంలో 44 ఉద్యోగాలున్నాయి.

పోస్టులను అనుసరించి అర్హతలను పేర్కొన్నారు. https://www.nmdc.co.in/careers వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తిస్థాయి నోటిఫికేషన్ చూడొచ్చు. ఆయా విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించాలి. అంతేకాకుండా పని అనుభవం కూడా ఉండాలి.

మొదటగా ట్రైనీ పిరియడ్ ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ చెల్లిస్తారు. 18 నెలలపాటు ట్రైనీ పిరియడ్ పూర్తి చేసుకున్న తర్వాత.. పూర్తి పే స్కేల్ ను వర్తింపజేస్తారు. నెలకు జీతం రూ.37,000 నుంచి రూ.1,30,000గా ఉంటుందని నోటిఫికేషన్ లో వివరించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 10, 2024వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ ద్వారానే ఆప్లికేషన్లను స్వీకరిస్తారు.

టాపిక్

తదుపరి వ్యాసం