TG Govt Jobs 2024 : 732కి పెరిగిన ఫార్మాసిస్ట్ ఉద్యోగ ఖాళీలు - దగ్గరపడిన దరఖాస్తుల గడువు..!-99 posts have increased in tg pharmacist recruitment notification 2024 full details read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Jobs 2024 : 732కి పెరిగిన ఫార్మాసిస్ట్ ఉద్యోగ ఖాళీలు - దగ్గరపడిన దరఖాస్తుల గడువు..!

TG Govt Jobs 2024 : 732కి పెరిగిన ఫార్మాసిస్ట్ ఉద్యోగ ఖాళీలు - దగ్గరపడిన దరఖాస్తుల గడువు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 18, 2024 05:00 PM IST

TG Pharmacist Recruitment 2024: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 633 ఫార్మాసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇటీవలే 99 పోస్టులను అదనంగా కలిపారు. వీటితో కలిపి మొత్తం 732 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులు అక్టోబర్ 21వ తేదీతో ముగియనున్నాయి.

ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు
ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు

తెలంగాణ వైద్యారోగ్యాశాఖ పరిధిలోని ఫార్మాసిస్ట్ గ్రేడ్‌ 2 ఉద్యోగ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొదట ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం… 633 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఇటీవలే వైద్యారోగ్యశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఖాళీగా ఉన్న మరో 99 ఫార్మాసిస్ట్ పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో మొదట ఇచ్చిన నోటిఫికేషన్ లోనే వీటిని చేరుస్తూ… ప్రకటన విడుదల చేసింది.

మొదట ఇచ్చిన 633తో పాటు తాజాగా వచ్చిన 99 కలిపి మొత్తం 732 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ గడువు అక్టోబర్ 21వ తేదీతో పూర్తి అవుతుంది.

  • అక్టోబర్ 21తో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు పూర్తవుతుంది.
  • అక్టోబర్ 23, 24 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.
  • ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు నవంబర్ 30వ తేదీన జరుగుతాయి.
  • https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ పద్దతిలో పనిజేసే వారికి వెయిటేజ్‌ కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫార్మసీ పూర్తి చేయటంతో పాటు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో నమోదు చేసుకొని ఉండాలి. అభ్యర్ధులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు.

ఇలా దరఖాస్తు చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Click here to apply for the post of Pharmacist Grade-II లింక్ పై క్లిక్ చేయాలి.
  • ప్రాథమిక వివరాలు, మెయిల్ అడ్రస్ తో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
  • దరఖాస్తు రుసుం రూ. 200 చెల్లించాలి.
  • ఆన్ లైన్ అప్లికేషన్ అడిగిన వివరాలతో పాటు ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

ముఖ్య తేదీలు :

మొత్తం ఖాళీలు - 633 + 99 = 732

దరఖాస్తులకు తుది గడువు - 21, అక్టోబర్ , 2024.

దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ - అక్టోబర్ 23, 24

రాత పరీక్షలు - 30 నవంబర్ 2024.

అధికారిక వెబ్ సైట్ - https://mhsrb.telangana.gov.in/

Whats_app_banner