Pataleshwar Shiv Temple : చీపురు తాకితే చర్మ వ్యాధి మాయం.. శివాలయంలో సైన్స్‌కి దొరకని మిస్టరీ!-touching the broom cures skin diseases in moradabad shiva temple ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Pataleshwar Shiv Temple : చీపురు తాకితే చర్మ వ్యాధి మాయం.. శివాలయంలో సైన్స్‌కి దొరకని మిస్టరీ!

Pataleshwar Shiv Temple : చీపురు తాకితే చర్మ వ్యాధి మాయం.. శివాలయంలో సైన్స్‌కి దొరకని మిస్టరీ!

Galeti Rajendra HT Telugu
Aug 14, 2024 02:00 PM IST

Brooms as Offering in Shiva Temple: మనం ఇంట్లో చీపురుని చాలా చీప్‌గా చూస్తుంటాం. కానీ.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ దేవాలయంలో చీపురును శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించి.. దాన్ని తాకుతూ..?

శివుడు
శివుడు (ANI)

Pataleshwar Shiv Mandir : హిందూ దేవాలయల ముందు సాధారణంగా భక్తులందరూ పూలు, పళ్లు, కొబ్బరికాయ.. కొందరు నైవేద్యంతో కనిపిస్తుంటారు. కానీ.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ శివాలయం ముందు భక్తులందరూ చీపుర్లతో దర్శనానికి వెళ్తుంటారు. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం.. గత కొన్ని దశాబ్దాలుగా సైన్స్‌కి కూడా అంతుచిక్కని చీపురు మిస్టరీ ఈ దేవాలయంలో ఉంది.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో పాతాలేశ్వర్ అనే ఒక ప్రాచీన శివాలయం ఉంది. ఆ ఆలయానికి సాధారణ భక్తుల కంటే దీర్ఘకాలిక చర్మవ్యాధులతో బాధపడే రోగులే వస్తుంటారు. దానికి కారణం.. అక్కడ శివుడికి చీపురు సమర్పించి.. దాన్ని తాకితే చర్మవ్యాధి నయం అవుతుందని ఓ నమ్మకం.

చాలా మందికి అలా నయం కావడంతో.. దేశ వ్యాప్తంగా భక్తులు అక్కడికి రోజూ తరలి వస్తుంటారు. మరీ ముఖ్యంగా.. శివరాత్రి పర్వదినం, శ్రావణ మాసంలో భారీ క్యూ ఆ ఆలయం ముందు దర్శనమిస్తుంటుంది.

పాతాలేశ్వర్ ఆలయంలో శివలింగం కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. లింగం మూలాధారం పాతాళంలో ఉండటంతో.. ఆ లోతుని పరీక్షించేందుకు దశాబ్దాలుగా చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు.

అనుకోకుండా వచ్చి.. గుడి కట్టి

పాతాలేశ్వర్ ఆలయం గురించి చాలా కథలు వినికిడిలో ఉన్నాయి. కానీ.. ఆ ఆలయం ఉన్న గ్రామస్థులు మాత్రం దేవాలయాన్ని భిఖారి దాస్ అనే వ్యాపారవేత్త నిర్మించాడని చెప్తున్నారు. దీర్ఘకాలిక చర్మవ్యాధితో బాధపడుతూ ఆ ప్రదేశంలోని ఆశ్రమానికి వెళ్లిన వ్యాపారి.. నీళ్లు తాగుతూ యాదృశ్చికంగా తన చేతితో చీపురుని తాకాడట.

రోజుల వ్యవధిలోనే అతనికి ఉన్న చర్మవ్యాధి నయం అయ్యిందని.. దాంతో తిరిగొచ్చిన వ్యాపారి ఆ ఆశ్రమ వాసులకి ధనం, బంగారం ఇవ్వబోగా.. సున్నితంగా తిరస్కరించిన సాధువులు.. అక్కడ ఒక గుడి కట్టించమని కోరారట. దాంతో భారీగా ఖర్చు చేసి నిపుణులతో సైన్స్‌కి కూడా అంతుచిక్కని విధంగా ఆ గుడిని వ్యాపారి నిర్మించినట్లు చెప్తుంటారు.

పాతాలేశ్వర్ ఆలయంలో ఏడాదికి రెండు సార్లు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ నుంచే కాదు..వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి వస్తారు. ఆ జాతరలో అన్నింటి కంటే ఎక్కువగా కనిపించేది చీపుర్లు అమ్మే షాపులేనట.

Whats_app_banner