Peddapuram Maridamma Jatara : అంగరంగ వైభవంగా పెద్దాపురం మరిడమ్మ జాతర, లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు
- Peddapuram Maridamma Jatara : పెద్దాపురం శ్రీ మరిడమ్మ ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఎంతో విశిష్ట కలిగిన మరిడమ్మవారి ఉత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరుగుతోంది.
- Peddapuram Maridamma Jatara : పెద్దాపురం శ్రీ మరిడమ్మ ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఎంతో విశిష్ట కలిగిన మరిడమ్మవారి ఉత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరుగుతోంది.
(1 / 8)
పెద్దాపురం శ్రీ మరిడమ్మ ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఎంతో విశిష్ట కలిగిన మరిడమ్మవారి ఉత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరుగుతోంది.
(2 / 8)
మరిడమ్మ ఆషాఢమాసం జాతర జులై 5 నుంచి ఆగస్టు 10 వరకు 37 రోజుల పాటు జరుగుతోంది. జులై 4 (గురువారం) రాత్రి జాగరణ ఉత్సవంతో జాతర ప్రారంభం అయింది. ప్రధానంగా మంగళవారం, గురువారం, ఆదివారాల్లో భక్తుల తాకిడి భారీగా ఉంటుంది. దాదాపు నెలకు పైగా జరిగే ఉత్సవం కావడంతో గోదావరి జిల్లాల్లో చాలా పవిత్రంగా చూస్తారు. ఆయా జిల్లాల్లో ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని నివాసం ఉంటున్నవారు కూడా ఈ ఉత్సవానికి వచ్చి అమ్మ వారిని దర్శించుకుంటున్నారు.
(3 / 8)
ఇప్పటివరకు దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులు మరిడమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
(4 / 8)
రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీమరిడమ్మ వారి దేవస్థానం నిర్వహించే ఈ ఉత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేశారు. పెద్దాపురం మున్సిపాలటీ పారిశుద్ధ్య కార్మికులు ఆలయ పరిసరాలను నిత్యం శుభ్రం చేస్తున్నారు. అలాగే పోలీసులు భద్రత ఏర్పాట్లు నిర్వహిస్తారు. రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ కూడా తమ సేవలను అందిస్తుంది. అలాగే విద్యుత్ శాఖ కూడా తమ సహాయం అందిస్తుంది. విద్యుత్ దీపాల అలంకరణతో మరిడమ్మ దేవాలయం వెలిగిపోతుంది.
(5 / 8)
రథంపై మరిడమ్మ వారి దివ్యరూప ఉత్సవమూర్తిని విద్ద్యుద్దీపాలంకరణతో సుందరంగా అలంకరణ చేశారు. దేవస్థానం వారి పది గరగలతో అమ్మవారి గరగల నృత్యం చేశారు. శ్రీదేవి గరగ నాట్య బృంద, పేపకాయలపాలెం వారిచే గరగనాట్యం చేస్తారు. సామర్లకోట వారిచే కేరళ డ్రమ్స్ కార్యక్రమం ఉంటుంది. అఘోర వేషాల కార్యక్రమం కూడా ఉంటుంది. నాదస్వరం, తప్పెటగుళ్లు, శూలాల సంబరం, కాళికాదేవి వేషాలు, పొడువుకాళ్లు, బుట్టబొమ్మలు, కాంతారా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతర సమయంలో అమ్మవారి కాలక్షేప మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
(6 / 8)
మరిడమ్మ అమ్మవారి మహోత్సవం ప్రతి సంవత్సరం జేష్ఠ మాసం అమావాస్య నాడు ప్రారంభమై ఆషాడమాసంలోని అమావాస్య వరకు 37 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాష్ట్ర నలుమూల నుంచి మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఒక్క ఆదివారం రోజునే 40 నుంచి 50 వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. అలాగే మంగళవారం, గురువారాల్లో కూడా భక్తులు భారీగానే వస్తుంటారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారు.
(7 / 8)
మరిడమ్మ తల్లి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ప్రసిద్ధి చెందింది. 1952లో ఈ దేవాలయం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లింది. 17వ శతాబ్దంలో పెద్దాపురంలో మానోజీ చెరువుకి అతి సమీపంలో శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిశారు. ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశమంతా అడవిగా ఉండేది. ఒకసారి ఆ అడవిలో పశువుల కాపరులకి 16 ఏళ్ల యువతి కనిపించి నేను చింతపల్లి వారి ఆడపడుచుని నేను ఈ ప్రదేశంలో ఉన్నానని మా వాళ్లకు చెప్పండి. అని చెప్పి మాయం అయిందని చరిత్ర చెబుతుంది.
ఇతర గ్యాలరీలు