తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nizamabad Ggh : నిజామాబాద్‌ జీజీహెచ్ లో 24 గంటల్లో 59 సర్జరీలు

Nizamabad GGH : నిజామాబాద్‌ జీజీహెచ్ లో 24 గంటల్లో 59 సర్జరీలు

HT Telugu Desk HT Telugu

28 August 2022, 17:36 IST

google News
    • నిజామాబాద్‌లోని జీజీహెచ్ రికార్డు సృష్టించింది. ఒకేరోజులో 59 శస్త్రచికిత్సలు చేశారు అక్కడి డాక్టర్లు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ప్రతీకాత్మక చిత్రం

నిజామాబాద్‌లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులు ఒకేసారి 59 శస్త్రచికిత్సలు చేసి రికార్డు సృష్టించారు. గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ విభాగాలకు చెందిన నిపుణులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు 24 గంటల్లో ఏకకాలంలో శస్త్రచికిత్సలు నిర్వహించారు. గురువారం మోకాలి మార్పిడి, ఇతర శస్త్రచికిత్సలను ప్లాన్ చేశామని GGH మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ చెప్పారు. అయితే కొన్ని అత్యవసర కేసులు కూడా వచ్చాయన్నారు. దీంతో సర్జరీలు చేసే సంఖ్య పెరిగిందన్నారు.

ఆపరేషన్ థియేటర్‌లను సిద్ధం చేశామని, వివిధ విభాగాల వైద్యులు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని ప్రతిమ రాజ్‌ తెలిపారు. ఒకేరోజు 59 శస్త్రచికిత్సలు చేసిన జీజీహెచ్‌ వైద్యుల బృందాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి అభినందించారు. ఈ చొరవ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల సేవల నాణ్యతను చూపుతుందని ఆయన అన్నారు.

తదుపరి వ్యాసం