నిజామాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు.. ట్రైనర్ అరెస్టు.. శిక్షణలో తెలుగు రాష్ట్రాల వారు
నిజామాబాద్‌లో ఉగ్రవాదుల లింకులు ఉన్నాయనే విషయం బయటకు రాగానే కలకలం రేపుతోంది. ట్రైనింగ్ పేరిట మత ఘర్షణలకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
నిషేధిత సిమీ(Students Islamic Movement of India) అనుబంధ సంస్థ అయిన పీఎఫ్ఐ (Popular Front of India) ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ట్రైనర్ ఖాదర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ట్రైనింగ్ పేరిట పీఎఫ్ఐ మత ఘర్షణల పాల్పడేందుకు చూస్తొందని తెలుసుకున్నారు. నిజామాబాద్ లోని ఆటోనగర్ లో ఓ ఇంట్లో ఉగ్ర శిక్షణా జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడకు వెళ్లిన చూసిన పోలీసులకు కదలికలు అలాగే ఉన్నట్టుగా గుర్తించారు.
బుధవారం రోజున ఇంటిపై దాడి చేశాడు. లోపల ట్రైనింగ్ ఇస్తున్న ఖాదర్ ను అరెస్టు చేసి.. భగ్నం చేశారు. శిక్షణలో జగిత్యాల, హైదరాబాద్, కర్నూలు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. ఇంట్లో మారణాయుధాలు, నిషేధిత సాహిత్యం, నోట్ బుక్స్ లాంటివి కూడా దొరికాయి.
వారిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ మెుదలు పెట్టారు. అయితే మత ఘర్షణలు జరిగిన సమయంలో ఏం చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నట్టుగా విచారణలో తేలింది. నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్ఐ ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుందనే దానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఖాదర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు.
ఇలాంటివాటిపై.. యువత ఆసక్తి చూపొద్దని.. పోలీసులు హెచ్చరించారు. జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. సంయమనం పాటించాలని కోరారు. గతేడాది సైతం.. ఇలాంటి కుట్రనే పోలీసులు భగ్నం చేశారు. బోధన్ లో ఒకే అడ్రస్ పై బంగ్లాదేశీయులకు 72 పాస్ పోర్టులు జారీ అయ్యాయి. గతంలో బోధన్ లో ఉగ్ర కదలికలు సైతం బయటకు వచ్చాయి. సౌదీలో ఉన్న సమయంలో అతడి కదలికలపై నిఘా పెట్టారు. ఉగ్రవాదులతో లింకులున్నాయని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.
టాపిక్