తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Orr Mla Accident: ముందు వెళ్లే వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పిన ఎమ్మెల్యే కారు… రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే దుర్మరణం

ORR MLA Accident: ముందు వెళ్లే వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పిన ఎమ్మెల్యే కారు… రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే దుర్మరణం

Sarath chandra.B HT Telugu

23 February 2024, 11:23 IST

    • ORR MLA Accident: అతివేగం, డ్రైవర్‌ నిద్ర మత్తులోనే ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టిన తర్వాతే వాహనం అదుపు తప్పినట్టు భావిస్తున్నారు. 
ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే కారు, 100కి.మీ దగ్గర నిలిచిన స్పీడో మీటర్
ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే కారు, 100కి.మీ దగ్గర నిలిచిన స్పీడో మీటర్

ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే కారు, 100కి.మీ దగ్గర నిలిచిన స్పీడో మీటర్

ORR MLA Accident: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రైలింగ్ ఢీకొట్టినట్టు తొలుత భావించారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ఘటన ఎలా జరిగిందో గుర్తించలేకపోయారు.

ట్రెండింగ్ వార్తలు

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

తెల్లారిన తర్వాత ఘటనా స్థలానికి రెండు వందల మీటర్ల దూరంలో వాహన భాగాలు చెల్లాచెదురుగా పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ముందు వెళుతున్నవాహనాన్ని ఢీకొట్టి తర్వాత వాహనం అదుపు తప్పి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్పాట్‌లోనే ఎమ్మెల్యే లాస్య ప్రాణాలు కోల్పోయారు.

ఎమ్మెల్యే కారు విడిభాగాలు పడిఉన్న ప్రదేశం నుంచి నియంత్రణ కోల్పోయిన కారు రోడ్డు మార్జిన్‌లో ఉన్న రైలింగ్‌ ఢీ కొన్నట్టు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం 100కి.మీకు పైగా వేగంతో ప్రయాణిస్తోంది. స్పీడో మీటర్‌ 100కి.మీవద్ద నిలిచిపోయింది.

ముందు వెళుతున్న కారును ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ అపస్మారక స్థితికి చేరుకుని స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. అదే వేగంతో రోడ్డుకు ఎడమ వైపు దూసుకుపోయింది. ముందు వెళుతున్న వాహనం దగ్గరకు వచ్చే వరకు దానిని గుర్తించలేకపోవడమో, ఎదురు వెళుతున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో వెనుక నుంచి దానిని ఢీకొట్టడమో జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు డ్రైవర్‌ వైపు భాగమంతా పూర్తిగా ధ్వంసమైంది.

సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో….

ప్రమాదం జరిగిన వెంటనే రెండు ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నా డ్రైవర్ పక్క సీట్లోనే కూర్చున్న ఎమ్మెల్యే లాస్య ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన స్పాట్‌లోనే ఆమె ప్రాణాలు విడిచారు. డ్రైవింగ్‌ సీట్లో ఉన్న ఆకాష్ సీటు బెల్టు పెట్టుకోవడంతో గాయాలతో బయటపడ్డాడు.

ఎమ్మెల్యే లాస్య మాత్రం సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు పేర్కొన్నారు. దీంతో వాహనం ఎదుటి వాహనాన్ని ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు కారు బానెట్‌ మీద సిమెంట్ మరకలు ఉండటంతో, రెడీ మిక్స్ వాహనం ఢీకొట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా వెళ్లే సిమెంట్ మిక్సర్ వాహనాన్ని తప్పించుకునే క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టి, ఆపై రైలింగ్‌ను ఢీకొట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు. ప్రమాదానికి కొద్ది దూరంలోనే ఔటర్ ఎగ్జిట్ ఉండటంతో వాహనాన్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.

సీటు బెల్టు పెట్టుకుని ఉంటే ఎమ్మెల్యే ప్రాణాలు నిలిచి ఉండేవని హైవే పెట్రోలింగ్ సిబ్బంది చెబుతున్నారు. రైలింగ్ ఢీకొట్టిన తర్వాత వాహనంలో ఎమ్మెల్యే మృతదేహం ఇరుక్కుపోవడంతో మధ్యలో ఉన్న సీట్ల ద్వారా బయటకు తీయాల్సి వచ్చింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.

తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోనే కుమార్తె లాస్య కూడా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన లాస్య నందితకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత కంటోన్మెంట్‌లోని నివాసానికి మృతదేహాన్ని తరలించనున్నారు.

తదుపరి వ్యాసం