తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Konda Surekha : మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. కారు ఆపి.. చెప్పుల షాపుకెళ్లి..

Konda Surekha : మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. కారు ఆపి.. చెప్పుల షాపుకెళ్లి..

26 November 2024, 16:36 IST

google News
    • Konda Surekha : కొండా సురేఖ.. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్. వరంగల్ జిల్లాలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకురాలు. డైలాగ్‌లను బుల్లెట్లలా పేల్చే సురేఖ.. తాజాగా బాలిక పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. బాలిక చెప్పులు లేకుండా నడవటం చూసి చలించిపోయారు. వెంటనే కారు ఆపి.. బాలికను దగ్గరకు తీసుకున్నారు.
మానవత్వాన్ని చాటుకున్న కొండా సురేఖ
మానవత్వాన్ని చాటుకున్న కొండా సురేఖ

మానవత్వాన్ని చాటుకున్న కొండా సురేఖ

నిత్యం పరిపాలనలో బిజీగా ఉండే మంత్రి కొండా సురేఖ.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పెద్దపల్లి జిల్లాకు వెళ్తున్నారు. మంత్రి కారులో వెళ్తుండగా (బీహార్ కు చెందిన కూలీలు) తల్లిదండ్రులతో కలిసి ఓ చిన్నారి చెప్పులు లేకుండా నడుస్తోంది. బాలిక చెప్పులు కూడా లేకుండా వెళ్తుండడాన్ని మంత్రి కొండా సురేఖ గమనించారు. బాలికను చూసి చలించిపోయారు.

వెంటనే సిబ్బందికి చెప్పి కొండా సురేఖ కారు ఆపించారు. ఆ చిన్నారిని కారు ఎక్కించుకొని చెప్పుల దుకాణంలోకి తీసుకెళ్లారు. దగ్గరుండి ఆ పాపకి చెప్పులు కొనిచ్చారు. అంతేకాదు.. ఆ చిన్నారి చిరిగిపోయిన డ్రెస్ వేసుకుంది. దీంతో బట్టల షాపులోకి వెళ్లి.. ఆ పాపకు డ్రెస్సులు కొనిచ్చారు. ఆ తర్వాత పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. వారు మంత్రి సురేఖకు థ్యాంక్స్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సురేఖ ఇంట్లో పార్టీ..

ఇటీవల కొండా సురేఖ ఇంట్లో పార్టీ జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. కొండా సురేఖ ఇంట్లో బీర్ పార్టీ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ స్పందించారు. ఇది ఫ్యామిలీ పార్టీ అని స్పష్టం చేశారు. 14 ఏళ్ల తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా.. తన తల్లి కొండా సురేఖ స్టాఫ్‌‌కు పార్టీ ఇచ్చిందని స్పష్టం చేశారు.

సమంత విషయంలో..

గతంలో హీరోయిన్ సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపాయి. "కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాడు. నాగచైతన్య - సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లడానికి కూడా కారణం కేటీఆర్. ఈ విషయం అందరికీ తెలుసు" అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున స్పందించారు. "మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను" అని నాగార్జున ట్వీట్ చేశారు.

తదుపరి వ్యాసం