Samantha On Konda Surekha: కొండా సురేఖ కామెంట్స్‌పై మళ్లీ రియాక్ట్ అయిన సమంత.. ఏం చెప్పిందంటే?
Samantha Reacts To Konda Surekha Comments Again: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై స్టార్ హీరోయిన్ సమంత మరోసారి స్పందించింది. సిటాడెల్ హనీ బన్నీ ఓటీటీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Samantha On Konda Surekha Again: ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. కొండా సురేఖ వ్యాఖ్యలను సమంత, నాగార్జున, నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా తీవ్రంగా ఖండించారు.
సిటాడెల్ ట్రైలర్
అనంతరం కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం, మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా వేయడం వంటివి కూడా జరిగాయి. అయితే, తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందించింది. సమంత నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ "సిటాడెల్: హనీ బన్నీ" ట్రైలర్ అక్టోబర్ 16న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ చేస్తోంది సమంత అండ్ టీమ్.
సపోర్ట్‌గా నిలిచారు
తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సమంత, హీరో వరుణ్ ధావన్ పాల్గొన్నారు. ఇందులో "మీపై వచ్చిన వ్యాఖ్యలపై మీ ఇండస్ట్రీ, ఇతర సినీ ఇండస్ట్రీ, మీడియా ఎంతోమంది సపోర్ట్‌గా నిలిచారు. అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?" అని హోస్ట్ అడిగాడు. దానికి సమంత ఇచ్చిన రియాక్షన్, చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అందుకే బయటపడ్డాను
"ఇవాళ ఇక్కడ కూర్చోడానికి ఎంతోమంది సపోర్ట్ కారణం. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. వారు నాపై ఎంతమాత్రం గివ్ అప్ చేయలేదు. వారంతా నాలో ఎంతో ధైర్యం నింపారు. నేను కష్టాలను ఎదుర్కోవడంతో వారి సపోర్ట్ నాకెంతో సహాయపడింది" అని సమంత చెప్పింది.
"వారంతా నా పక్షాన నిలబడ్డారు కాబట్టే నేను ఈ పరిస్థితి నుంచి బయటపడగలిగాను. లేకుంటే దాన్ని ఎదుర్కొనేందుకు నాకు చాలా సమయం పట్టేది. నా చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే నేను సమస్యలను, పరిస్థితులను ఎదుర్కోగలిగాను" అని సమంత మరోసారి కొండా సురేఖ వివాదంపై రియాక్ట్ అయింది.
ఇక ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కూడా సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. "అలాంటి వారి గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ద్వేశపూరిత మేసేజెస్ వచ్చినప్పుడు వాటి ప్రభావం నాపై పడకుండా చూసుకుంటాను. దాన్ని పంపినవారు కూడా అలాంటి బాధనే అనుభవించారేమో అని ఆలోచిస్తాను" అని చెప్పుకొచ్చింది సామ్.
నేను చేస్తాను అనుకోలేదు
అలాగే, సిటాడెల్ వెబ్ సిరీస్ గురించి "ఈ సిరీస్ కోసం డైరెక్టర్స్ నన్ను అడిగినప్పుడు నేను చేయలేనని చెప్పాను. నిజంగా ఈ పాత్రను నేను చేస్తాను అని అనుకోలేదు. ఆ రోల్‌కు సరిపోయే నలుగురు హీరోయన్ల పేర్లను కూడా నేను డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేకు చెప్పాను. వాళ్లు ఆ పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరని చెప్పాను" అని సమంత తెలిపింది.
"ఆ పాత్రను నేను చేయలేనని వేడుకున్నా. అయినా వాళ్లు వినలేదు. పట్టుబట్టి నాకోసం వెయిట్ చేశారు. ఇప్పుడు సిరీస్ పూర్తి అయ్యాక ఇంత గొప్ప పాత్ర ఇచ్చిన డైరెక్టర్స్‌కు థ్యాంక్స్ చెప్పాను. మరొకరిని తీసుకోకుండా నాతో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా" అని సమంత సిటాడెల్ హనీ బన్నీ పాత్ర గురించి వెల్లడించింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఇకపోతే సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబర్ 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సమంతకు జోడీగా వరుణ్ ధావన్ యాక్ట్ చేశాడు.