తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Ktr On Lrs: ఉచితంగా లేఔట్‌ క్రమబద్దీకరణలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్… 6,7 తేదీల్లో ఆందోళనకు పిలుపు

BRS KTR on LRS: ఉచితంగా లేఔట్‌ క్రమబద్దీకరణలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్… 6,7 తేదీల్లో ఆందోళనకు పిలుపు

Sarath chandra.B HT Telugu

04 March 2024, 12:38 IST

google News
    • BRS KTR on LRS: అధికారంలోకి రాకముందు ఉచితంగా లే ఔట్ క్రమబద్దీకరణకు చేస్తామన్న కాంగ్రెస్, ఇప్పుడు 20వేల కోట్లను ప్రజల నుంచి  వసూలు చేసేందుకు రెడీ అయ్యిందని  బిఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆరోపించారు. 
ఎల్‌‌ఆర్‌ఎస్‌ స్కీమ్ ప్రకటనపై కేటీఆర్ ఆగ్రహం
ఎల్‌‌ఆర్‌ఎస్‌ స్కీమ్ ప్రకటనపై కేటీఆర్ ఆగ్రహం

ఎల్‌‌ఆర్‌ఎస్‌ స్కీమ్ ప్రకటనపై కేటీఆర్ ఆగ్రహం

BRS KTR on LRS: అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చి, వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు, ఐదేళ్లలో 414 హామీలు అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ Congress ఇప్పుడు మోసం చేస్తోందని బిఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ Working pResident కేటీఆర్ ఆరోపించారు.

లే ఔట్ క్రమబద్దీకరణ పేరుతో తెలంగాణలో ప్రజల నుంచి రూ.20వేల కోట్లను తోలు ఒలిచి వసూలు చేయడానికి సిద్ధం అయ్యారని, మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు నిర్ణయించడం ఏమిటని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు క్రమద్దీకరణ ఉచితంగా చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమాయ్యారని ప్రశ్నించారు. మంత్రులు భట్టి, సీతక్క ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

అప్పట్లో ప్రజల్లో మీద భారం మోపుతున్నారని ఆరోపించి ఇప్పుడు 20వేల కోట్ల భారాన్ని మధ్య తరగతి ప్రజలపై మోపేందుకు సిద్ధమయ్యారని, ఎల్‌ఆర్‌ఎస్‌ LRS దరఖాస్తు చేసిన 25లక్షల 44వేల మందికి ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కో కుటుంబం మీద లక్ష రుపాయల భారం పడుతుందని, ముఖ్యమంత్రి స్వయంగా మార్చి 31లోపు వసూలు చేయాలని ఆదేశించారని దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. పేద ప్రజలు కష్టపడి పోగేసుకున్న పెట్టుబడులు లాక్కునేలా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. . ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో గతంలో భట్టి Bhatti విక్రమార్క చేసిన డిమాండ్‌కు తాను కట్టుబడి ఉన్నానని కేటీఆర్ చెప్పారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన భూములకు ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ వసూలు చేయడం ఏమిటన్నారు.

25లక్షల కుటుంబాలు మార్చి 31లోగా డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడం తగదన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఎండిఏ Hmda, జిహెచ్‌ఎంసి GHMC కార్యాలయాల వద్ద ధర్నాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. నష్టపోయే వారంతా తమకు మద్దతుగా ఆరో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. తర్వాత జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలను కలిసి బాధితుల తరపున వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్ వసూళ్లపై తమ పార్టీ తరపున న్యాయపోరాటం కూడా చేస్తామన్నారు. అప్పట్లో ఫ్రీ అని ఇప్పుడు ఫీజు అడుగుతున్న వారంతా తమ వైఖరి వెల్లడించాలన్నారు. మంత్రులు భట్టి, సీతక్క, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి చెప్పిన మాటల్ని ప్రతి గామానికి సోషల్ మీడియా ద్వారా చేరవేస్తామన్నారు.

మార్చి ఆరు, ఏడో తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేపట్టాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టాలని అడిగే వారిని నిలదీయాలన్నారు. అధికారులకు భట్టి, ఉత్తమ్, సీతక్క మాటల్ని చూపించి ప్రశ్నించాలన్నారు.

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ ప్రకటిస్తే, లే ఔట్ రెగ్యులేషన్ స్కీమ్‌ విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని ఆరోపించారు. 2020 ఆగష్టు 30 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 25.44లక్షల దరఖాస్తులు ఇచ్చారని, లే ఔట్ రిజిస్ట్రేషన్‌ కోసం వెయ్యి రుపాయలు ఫీజు పెడితే దీనిపై కోమటిరెడ్డి కోర్టుకు వెళ్లారని, ఎల్‌ఆర్‌ఎస్‌ గుదిబండగా మారిందని ఆరోపించారని గుర్తు చేశారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం మార్గదర్శకాలు వెలువరించి ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్దీకరణకు ప్రయత్నాలు చేస్తే వచ్చేది మా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తుందని భట్టి విక్రమార్క ప్రకటించారని, కోమటిరెడ్డికి సంఘీభావం ప్రకటించిం ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తామని ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి నో ఎల్‌ఆర్‌ఎస్‌, నో టిఆర్‌ఎస్‌ పిలుపునిచ్చారని, ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టొద్దని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా భూముల్ని క్రమద్దీకరిస్తామని పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని కేటీఆర్ వివరించారు.

ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు కట్టొద్దని కాంగ్రెస్‌ నేతలు గతంలో పిలుపు ఇచ్చారని. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో డబ్బులు వసూలుకు ఎందుకు సిద్ధమయ్యారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

25లక్షల కుటుంబాలకు ఒక్కో కుటుంబం మీద లక్ష రుపాయల భారం మోపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమవుతోందని దీనిని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఎల్‌ఆర్‌ఎస్ కట్టొద్దని గతంలో పిలుపునిచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క మాటల్ని చూపించి అధికారుల్ని ప్రజలు నిలదీయాలన్నారు. ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గుర్తించాలన్నారు.

తదుపరి వ్యాసం