BRS : వడ్డీ లేకుండానే హోమ్ లోన్లు..! - కొత్త స్కీమ్ పై కేటీఆర్‌ ప్రకటన-ktr key statement about unveils home loan interest subsidy scheme for middle class section ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs : వడ్డీ లేకుండానే హోమ్ లోన్లు..! - కొత్త స్కీమ్ పై కేటీఆర్‌ ప్రకటన

BRS : వడ్డీ లేకుండానే హోమ్ లోన్లు..! - కొత్త స్కీమ్ పై కేటీఆర్‌ ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 25, 2023 05:34 AM IST

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. కొత్తగా ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న మధ్యతరగతి ప్రజల కోసం త్వరలో కొత్త స్కీమ్ తీసుకువస్తామని చెప్పారు. దీనిపై కసరత్తు జరుగుతుందన్నారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు హామీల వర్షాన్ని గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పార్టీల మేనిఫెస్టోలు రావటంతో పాటు పోలింగ్ ప్రక్రియకు టైం దగ్గరపడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలతో పాటు.... భారీగా హామీలను గుప్పించింది. అన్ని వర్గాలను ఆకర్షించే దిశగా అడుగులు వేసింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా పలు హామీలను ప్రకటించినప్పటికీ.... కొన్ని కీలకమైన ప్రకటన చేస్తోంది. ఇటీవలే ఆటో వాహనాల ఫిట్ నెస్ ఛార్జీలను మాఫీ చేస్తామని ప్రకటన చేయగా... తాజాగా కేటీఆర్ మరో ప్రకటన చేశారు.

‘హౌస్ ఫర్ అల్’....కేటీఆర్ కీలక ప్రకటన

శుక్రవారం హెచ్‌ఐసీసీలో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్థిరాస్తి శిఖరాగ్ర సదస్సు 2023 లో కేటీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్న వారి కోసం సరికొత్త పథకాన్ని ప్లాన్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరి ఇల్లు అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని చెప్పుకొచ్చారు. హౌసింగ్ ఫర్ ఆల్ నినాదం పెట్టుకున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం డబుల్ బెడ్ రూమ్, గృహలక్ష్మి పథకాలు ఉన్నాయని.... అవి అలాగే ఉంటాయని, కొత్తగా ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న మధ్యతరగతి ప్రజల కోసం త్వరలో కొత్త పథకం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. లోన్ తీసుకుని ఇండ్లు కొనుక్కోవాలనుకునే మధ్య తరగతి వారి కోసం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చూస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే ఆ లోన్‌‌కు సంబంధించిన ఇంట్రెస్ట్‌ను చెల్లించేలా కసరత్తు చేస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.

మరోవైపు నవంబరు 30వ తేదీనే పోలింగ్ ప్రక్రియ ఉంది. ప్రచారానికి అతి తక్కువ సమయం మిగిలిన నేపథ్యంలో….. అధికార బీఆర్ఎస్ వైపు నుంచి ఇంకా ఏమైనా కీలక ప్రకటనలు ఉంటాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో మరిన్ని అంశాలను చేర్చుతారంటూ చర్చ జరిగినప్పటికీ… అలాంటి పరిస్థితి ఏం కనిపించటం లేదు. అయితే నేతలు మాత్రం… మరోసారి అదికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయంలో ప్రకటన చేస్తూ… జనాలను ఆలోచనలో పడేస్తున్నట్లు కనిపిస్తోంది.

Whats_app_banner