KTR Questions PM: మూడు హామీల సంగతేంటి? మోదీకి కేటీఆర్‌ ప్రశ్నలు..-ktr questioned on twitter what about the partition promises given to telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Questions Pm: మూడు హామీల సంగతేంటి? మోదీకి కేటీఆర్‌ ప్రశ్నలు..

KTR Questions PM: మూడు హామీల సంగతేంటి? మోదీకి కేటీఆర్‌ ప్రశ్నలు..

Sarath Chandra HT Telugu
Oct 03, 2023 12:17 PM IST

KTR Questions PM: మూడ్రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణలో పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. తెలంగాణకు ఇచ్చిన మూడు ప్రధాన హామీల సంగతేమిటని ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

KTR Questions PM: ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పలు ప్రశ్నలు సంధించారు. మా మూడు ప్రధాన హామీల సంగతేంటని నిలదీశారు.

1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?

2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?

3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ? అంటూ ప్రశ్నించారు. మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నారని.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేదని ప్రశ్నించారు.

పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర అని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణపై మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడన్నారు. గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా అని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారని కేటీఆర్ ఆరోపించారరు.

లక్షల ఉద్యోగాలిచ్చే ఐ.టీ.ఐ.ఆర్ ను ఆగం చేశారని, మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారన్నారు. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారని ఆరోపించారు.

పదేళ్ల పాలనలో..4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు..140 కోట్ల భారతీయులను మోసం చేశారన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారని, దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారని,పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అన్నారని, మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప.. దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా అని కేటీఆర్ ప్రశ్నించారు.

పసుపు బోర్డు ప్రకటన కూడా.. మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల వేళ హంగామా అని, అది అమలు అయ్యేది ఎప్పుడోనన్నారు. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో… అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటన్నారు.

మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అన్నారు. మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అని ట్వీట్‌ చేశారు.

IPL_Entry_Point