Congress vs BRS : రాజీనామా ఇద్దాం - మల్కాజ్‌గిరిలోనే తేల్చుకుందాం రా .! సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్-let us both contest in lok sabha for malkajgiri ktr challenges cm revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Vs Brs : రాజీనామా ఇద్దాం - మల్కాజ్‌గిరిలోనే తేల్చుకుందాం రా .! సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్

Congress vs BRS : రాజీనామా ఇద్దాం - మల్కాజ్‌గిరిలోనే తేల్చుకుందాం రా .! సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 29, 2024 04:18 PM IST

KTR challenges CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మల్కాజ్ గిరిలో పోటీ చేద్దామని… ఎవరెంటో తేల్చుకుందామన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

KTR challenges CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. చేవెళ్ల సభ వేదికగా బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిసవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి మనఇద్దరం పోటీ చేద్దామని… ఎవరెంటో తేల్చుకుందామని సవాల్ విసిరారు.

“రేవంత్ రెడ్డి… నువ్వు ముఖ్యమంత్రి పదవి కి రాజీనామా చేసి మల్కాజిగిరి కి వచ్చి పోటీ చేయి చూసుకుందాం. నేనూ పోటీ చేస్తాను. నువ్వు కొడంగల్ రాజీనామా చేసి రా.. నేను సిరిసిల్లలో రాజీనామా చేసి వస్తాను. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటు గెలవాలని సవాల్ విసిరారు కదా… అక్కడ ఇక్కడ కాదు. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం. సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం. నీ సిట్టింగ్ సిట్ లోనే పోటీ చేద్దాం” అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.

వారిది ఏ కోటా…?

"గెలిచిన ప్రతిసారి మగాడివి, ఓడితే కాదు అంటావా ..? కొడంగల్ లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా..? మగాడివి అయితే రైతులకు 2 లక్షల రుణ మాఫీ చెయ్, ఇచ్చిన 420 హమీలు అమలు చెయ్.. ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవద్దా… ఇవేం మాటలు ? రేవంత్ కు ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. కొడంగల్, జీహెచ్ఎంసీ సమయంలో పోటీ చేసి సవాల్ విసరి పారిపోయిండు. ఆయన మాటకు విలువ ఏం ఉంది ? రేవంత్ కు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చెయ్.. మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. మరి నాది మేనేజ్ మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియాంక గాంధీలది ఏం కోటా ..? రేవంత్ ది పేమేంట్ కోటా.. మాణిక్యం ఠాకూర్ కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమేంట్ కోటా. పేమేంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్ డీల్లీకి పేమేంట్ చేయాలి. బిల్డర్లను బెదిరించాలి. వ్యాపారులను బెదిరించాలి. ఢిల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలి. అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారు. ఇప్పటివరకు ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డు ఎక్కుతారు. ఆయన నేనే సీఎం అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారు. ఆయనకు ఆయననే సీఎం అన్న నమ్మకం లేదా..? అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.

WhatsApp channel