తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Do Dham Irctc Tour Package : కేదార్ నాథ్, బద్రీనాథ్ దో ధామ్ యాత్ర- 7 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

Do Dham IRCTC Tour Package : కేదార్ నాథ్, బద్రీనాథ్ దో ధామ్ యాత్ర- 7 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

20 May 2024, 14:03 IST

google News
    • Do Dham IRCTC Tour Package : హరిద్వార్ నుంచి కేదార్ నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రోడ్డు మార్గంలో 7 రోజుల పాటు పలు పుణ్య క్షేత్రాలు, పవిత్ర నదులను వీక్షించవచ్చు.
కేదార్ నాథ్, బద్రీనాథ్ దో ధామ్ యాత్ర- 7 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు
కేదార్ నాథ్, బద్రీనాథ్ దో ధామ్ యాత్ర- 7 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు

కేదార్ నాథ్, బద్రీనాథ్ దో ధామ్ యాత్ర- 7 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు

Do Dham IRCTC Tour Package : కేదార్ నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవాలని భావిస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ హరిద్వార్ నుంచి దో ధామ్ యాత్ర ప్యాకేజీ అందిస్తోంది. రోడ్డు మార్గంలో 7 రోజులు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ఏడాది మే 23, జూన్ 23, సెప్టెంబర్ 23 తేదీల్లో రూ.33100 ప్రారంభ ధరలో ఈ టూర్ అందుబాటులో ఉంది.

ఐఆర్సీటీసీ ఈ ఏడాది దో ధామ్ యాత్రను ప్రారంభించింది. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇవి కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి. వీటిని "హిమాలయన్ చార్ ధామ్" అని పిలుస్తారు. ఈ పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 2024 సంవత్సరాని సంబంధించి దో ధామ్ యాత్ర మే 10, 2024 నుంచి ప్రారంభం అయ్యింది. హిందువులు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా చార్ ధామ్ యాత్రను చేపట్టాలని భావిస్తుంటారు.

ప్యాకేజీ ధర (ఒక్కో వ్యక్తికి)

సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్(5-11 ఏళ్లు)చైల్డ్ వితవుట్ బెడ్(5-11 ఏళ్లు)
రూ.59720రూ.37510రూ.33100రూ.17320రూ.11540

యాత్రికులు https://registrationandtouristcare.uk.gov.in/signin.php లింక్‌ ద్వారా చార్‌ధామ్, దో ధామ్ యాత్రను ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ప్రయాణ వివరాలు :

డే 01 : హరిద్వార్ - గుప్తకాశీ (205 కిమీ / 7 నుంచి 8 గంటల ప్రయాణం)

హరిద్వార్ లో నిర్ణీత పాయింట్ (హోటల్) లేదా రైల్వే స్టేషన్‌లో యాత్రికులను పిక్ అప్ చేసుకుని గుప్తకాశీకి బయలుదేరతారు. గుప్తకాశీలో హోటల్‌లో చెక్ ఇన్ చేసిన అనంతరం పట్టణాన్ని వీక్షించవచ్చు. రాత్రికి భోజనం, బస గుప్తకాశీలోనే ఉంటుంది.

డే 02: గుప్తకాశీ - సోనప్రయాగ్ - కేదార్‌నాథ్ (30 కి.మీ + 20 కి.మీ ట్రెక్)

అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి సోన్‌ప్రయాగ్‌కు బస్సులో బయలుదేరతారు. ఎక్కడ నుంచి మీరు కేదార్‌నాథ్ వరకు 20 కి.మీ ట్రెక్కింక్ ప్రారంభిస్తారు. నడవలేని వారు డోలీ లేదా గుర్రాన్ని అద్దెకు తీసుకోవచ్చు. గంగానది ప్రధాన ఉపనదులలో ఒకటైన మందాకిని కేదార్‌నాథ్ వద్ద ఉద్భవించి గౌరీకుండ్ గుండా ప్రవహిస్తుంది. కొన్నిసార్లు పొగమంచు పర్వతాలను ఆవరించి, మెల్లగా పైకి వెళ్తూ బ్లైండింగ్-వైట్ శిఖరాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. కేదార్‌నాథ్‌ చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రిపూట బస కేదార్ నాథ్ లో ఉంటుంది.

డే 03 : కేదార్నాథ్ - సోనప్రయాగ్ - గుప్తకాశీ (20 కి.మీ. ట్రెక్ + 30 కి.మీ / 52 కి.మీ. డ్రైవ్)

తెల్లవారుజామునే లేచి స్నానం చేసిన తర్వాత కేదార్‌నాథ్ శివునికి 'అభిషేకం' కోసం ఉదయం 4:45 గంటలకు ఆలయానికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ గర్భ గృహలోకి వెళ్లి విగ్రహాన్ని తాకవచ్చు. దర్శనం, పూజ తర్వాత మీరు ఆలయం నుంచి బయటకు వచ్చి హోటల్‌కి తిరిగి వస్తారు. తర్వాత మీరు కేదార్‌నాథ్ నుంచి సోన్‌ప్రయాగ్‌కు 20 కి.మీ తిరిగి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. సోన్‌ప్రయాగ్ లో మీ కోసం వేచి వాహనం అందుబాటులో ఉంచుతారు. మిమ్మల్ని గుప్త కాశీలో హోటల్‌కు తీసుకెళ్తారు. రాత్రి భోజనం, రాత్రి బస గుప్తకాశీలోనే ఉంటుంది.

డే 04: గుప్తకాశీ - జోషిమత్ - బద్రీనాథ్ (200 కి.మీ, 7 నుంచి 8 గంటల ప్రయాణం)

ఉదయం 08:00 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి జోషిమత్ మీదుగా బద్రీనాథ్‌కి వెళ్తారు. అద్భుతమైన ఘాట్ రోడ్డు మీదుగా డ్రైవింగ్ చేసిన తర్వాత మీరు బద్రీనాథ్ చేరుకుంటారు. బద్రీనాథ్‌లోని హోటల్‌లో చెక్ ఇన్ చేసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం బద్రీనాథ్ ఆలయ దర్శనానికి వెళ్లవచ్చు. రాత్రికి తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. బద్రీనాథ్‌లోనే రాత్రి భోజనం, బస చేస్తారు.

డే 05: బద్రీనాథ్ - జోషిమత్ - బీరాహి/రుద్రప్రయాగ్/శ్రీనగర్

ఉదయం బద్రీనాథ్ దర్శనానికి వెళ్తారు. దర్శనం తర్వాత హోటల్‌కు తిరిగి వెళ్లి హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి, బద్రీనాథ్ లోని స్థానిక ప్రదేశాల సందర్శనకు వెళ్లవచ్చు. వ్యాస్ గుఫా, గణేష్ గుఫా, మాతా మూర్తి ఆలయాలను సందర్శించవచ్చు. మధ్యాహ్నం కరణ్‌ప్రయాగ్ మీదుగా రుద్రప్రయాగ్ కు వెళ్తారు. రుద్రప్రయాగ్ అలకనంద మందాకిని నదుల పవిత్ర సంగమం వద్ద ఉన్న ఒక చిన్న పట్టణం. ఇక్కడ చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ఇక్కడ ఒకరోజు ఉంటారు. స్థానిక ప్రదేశాలను ఆస్వాదించవచ్చు. రుద్రప్రయాగ్‌లో రాత్రికి బస చేస్తారు.

డే 06: బీరాహి/రుద్రప్రయాగ్/శ్రీనగర్ - రిషికేష్ - హరిద్వార్

బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఆధ్యాత్మిక నగరం, యోగా రాజధాని అయిన రిషికేశ్‌కు వెళ్తారు. రిషికేశ్ చేరుకున్న తర్వాత అక్కడి సందర్శనా స్థలాలను రామ్ ఝులా లేదా లక్ష్మణ్ ఝులాను సందర్శించవచ్చు. సాయంత్రం హరిద్వార్‌కు డ్రైవ్ ఉంటుంది. హరిద్వార్ చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రికి హరిద్వార్‌లో బస చేస్తారు.

డే 07: హరిద్వార్

ఉదయం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. దీంతో దో ధామ్ పర్యటన ముగుస్తుంది.

బద్రీనాథ్

బద్రీనాథ్ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం సింఘ్‌ద్వార్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం సుమారు 50 అడుగుల ఎత్తులో బంగారు గిల్ట్ పైకప్పుతో కప్పబడి, పైన చిన్న కప్పుతో ఉంటుంది. బద్రీనాథ్ ఆలయం మూడు భాగాలుగా ఉంటుంది. గర్భగుడి, దర్శన మండపం, యాత్రికులు కోసం సభా మండపం.

బద్రీనాథ్ మందిరం గేట్ వద్ద భగవంతుని ప్రధాన విగ్రహానికి నేరుగా ఎదురుగా బద్రీనారాయణ భగవానుడి వాహనం గరుత్మంతుడి విగ్రహం ఉంది. గర్భ గుడి బంగారం పూతతో ఉంటుంది. బద్రీ నారాయణుడు, కుబేరుడు , నారద రిషి, ఉధవ ఇలా 15 విగ్రహాలు ఉంటాయి. వీటిల్లో అత్యంత ఆకర్షణీయమైన నల్లరాతితో చెక్కిన ఒక మీటరు ఎత్తైన బద్రీనాథ్ విగ్రహం ఉంటుంది.

కేదార్ నాథ్

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో 200 పైగా శివుని మందిరాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కేదార్‌నాథ్. కేదార్‌నాథ్‌లోని ఆలయం మంచుతో కప్పబడిన ఎత్తైన శిఖరాలతో చుట్టుముట్టి విశాలమైన పీఠభూమి మధ్యలో ఉంటుంది. ఈ ఆలయం 8వ శతాబ్దంలో జగద్ గురు ఆదిశంకరాచార్యులు నిర్మించారు. పాండవులు నిర్మించిన ఆలయంగా చెప్పే ప్రదేశానికి పక్కనే ఈ ఆలయం ఉంది. కేదార్‌నాథ్ ఆలయం చాలా పెద్దవి, బరువైన బూడిద రాళ్లతో అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. ఈ భారీ స్లాబ్‌లను శతాబ్దాల కిందట ఎలా తరలించారు అనే ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. ఈ ఆలయంలో పూజ కోసం గర్భ గుడి, యాత్రికుల కోసం మండపం ఉన్నాయి. ఆలయం లోపల శంఖంను పోలిన రాతి సదాశివ రూపంలో ఉన్న విగ్రహాన్ని పూజిస్తారు.

కేదార్ నాథ్, బద్రీనాథ్ దో ధామ్ ఐఆర్సీటీసీ ప్యాకేజీ బుక్కింగ్, పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=NDH27 ఈ లింక్ పై క్లిక్ చేయండి.

తదుపరి వ్యాసం