తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial Murder Episode : జీవన్‌రెడ్డి ఆవేదన చూసి బాధ కలిగింది : జగ్గారెడ్డి

Jagtial Murder Episode : జీవన్‌రెడ్డి ఆవేదన చూసి బాధ కలిగింది : జగ్గారెడ్డి

25 October 2024, 18:51 IST

google News
    • Jagtial Murder Episode : జగిత్యాలలో జరిగిన మర్డర్.. కాంగ్రెస్ పార్టీలో రచ్చకు కారణమైంది. జీవన్ రెడ్డికి మద్దతుగా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ జగ్గారెడ్డి.. ఈ ఇష్యూపై స్పందించారు. జీవన్‌రెడ్డి ఆవేదన చూసి బాధ కలిగిందన్నారు.
జగ్గా రెడ్డి
జగ్గా రెడ్డి

జగ్గా రెడ్డి

జగిత్యాల మండలం జాబితాపూర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అటు జిల్లాలో.. ఇటు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ హత్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. జీవన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు జగ్గారెడ్డి.

'జీవన్‌రెడ్డి ఆవేదన చూసి బాధ కలిగింది. ఏం జరుగుతుందో నాకు అర్థంకావడం లేదు. జీవన్‌రెడ్డికి అండగా నేను ఉంటా. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ వాది. ఆయన జీవితమంతా కష్టాలే. జీవన్‌రెడ్డి ఎప్పుడూ జనాల్లో ఉంటారు. జగిత్యాల ప్రజలు ఎందుకు ఓడించారో తెలియదు. సంగారెడ్డిలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన నన్ను.. ప్రజలు ఎందుకు ఓడించారో అర్థంకావడం లేదు' అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

కేసు దర్యాప్తు..

గంగారెడ్డిని హత్య చేసిన నిందితుడు సంతోష్‌ లొంగిపోయారు. అయితే.. ఈ హత్యకు ప్రోత్సహించింది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రఘుచందర్‌ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ నిర్వహించారు. తాను ఒక్కడినే నేరం చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు.

కానీ.. పోలీసులు మాత్రం నమ్మడం లేదు. కాల్‌డేటా ఆధారంగా ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాల్ డేటాలో దాదాపు 25 మందికిపైగా గుర్తించినట్లు తెలుస్తోంది. వారిలో మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న వ్యక్తుల నంబర్లు ఉంటే.. వారిని విచారించే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ చెబుతున్నారు.

తదుపరి వ్యాసం