తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Ooty Coonoor Tour : 5 రోజుల 'ఊటీ' ట్రిప్ - తిరుపతి నుంచి ట్రైన్ టూర్ ప్యాకేజీ వచ్చేసింది, ఇవిగో వివరాలు

IRCTC Ooty Coonoor Tour : 5 రోజుల 'ఊటీ' ట్రిప్ - తిరుపతి నుంచి ట్రైన్ టూర్ ప్యాకేజీ వచ్చేసింది, ఇవిగో వివరాలు

18 April 2024, 16:45 IST

    • IRCTC Tirupati Ooty Tour : ఊటీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. తిరుపతి నుంచి ఊ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ఆరు రోజులపాటు టూర్ కొనసాగుతుంది. మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి…
ఊటీ టూర్ ప్యాకేజీ
ఊటీ టూర్ ప్యాకేజీ (photo source from unsplash.com/)

ఊటీ టూర్ ప్యాకేజీ

IRCTC Ooty Coonoor Tour Package : ఈ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా ఉండే ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అలా అనుకుంటే ఊటీ(OOTY) ట్రిప్ చాలా బెటర్. అయితే ఇక్కడికి వెళ్లేందుకు IRCTC టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. తక్కువ ధరతోనే ఆరు రోజుల పాటు తిరిగి రావొచ్చు. ULTIMATE OOTY EX TIRUPATI (SHR095) పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్యాకేజీని ఏప్రిల్ 23వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో బుకింగ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 23వ తేదీన వీలుకాకపోయినప్పటికీ… వచ్చే వారంలో ప్లాన్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

TS Inter Admissions 2024-25 :తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, రేపట్నుంచి అప్లికేషన్లు జారీ

Tirumala Tour : ఒకే ఒక్క రోజులో తిరుమల ట్రిప్, ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం - తెలంగాణ టూరిజం నుంచి అదిరిపోయే ప్యాకేజీ

MSP For Wet Paddy : తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

TS Group 1 Officers Association : గ్రూప్ 1 పోస్టులన్నింటికీ సమాన వేతనం ఇవ్వండి.. సీపీఎస్ రద్దుపై పీఆర్సీ కమిటీకి లేఖ

Tirupati Ooty Tour: తిరుపతి - ఊటీ టూర్ వివరాలు:

  • ఊటీని చూసేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
  • తిరుపతి నగరం నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 
  • ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
  • ప్రస్తుతం ఏప్రిల్ 23వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో బుకింగ్ చేసుకోవచ్చు.
  • 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
  • Day 1- తిరుపతి నుంచి  రాత్రి 11.55 గంటలకు రైలు(Train No.17230, Sabari Express) బయల్దేరుతుంది. 
  • Day 2 - ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు.  మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. 
  • Day 3 - ఉదయం టిఫిన్ చేసిన తర్వాత Dodabetta, టీ మ్యూజియం, పైకార ఫాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే బస చేస్తారు.
  • Day  4 - టిఫిన్ చేసిన తర్వాత ఊటీ నుంచి కున్నూరుకు వెళ్తారు. ఇక్కడ పలు ప్రాంతాలను సందర్శిస్తారు. తిరిగి ఊటీకి చేరుకుంటారు. 
  • Day  5 -  కోయంబత్తూరు కు చేరుకుంటారు.  సాయంత్రం 04:35 నిమిషాలకు రైలు(Train No. 17229,) ప్రయాణం మొదలవుతుంది.
  • Day 6 - రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ముగుస్తుంది.
  • ఈ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 31,230ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 16690 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.13080గా ఉంది. 
  • స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 29890, డబుల్ షేరింగ్ కు రూ. 15350, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 11740గా ఉంది.
  • 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. 
  • ఈ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
  • https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ కూడా చేసుకోవచ్చు. 
  • ఏమైనా సందేహాలు ఉంటే 8287932317, 8287932312 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.