Ananthagiri Hills Tour : వీకెండ్ లో 'అనంతగిరి హిల్స్' వెళ్లొద్దామా..! వన్ డే ట్రిప్ ప్యాకేజీ వివరాలివే-telangana tourism operate ananthagiri tour package from hyderabad check the full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ananthagiri Hills Tour : వీకెండ్ లో 'అనంతగిరి హిల్స్' వెళ్లొద్దామా..! వన్ డే ట్రిప్ ప్యాకేజీ వివరాలివే

Ananthagiri Hills Tour : వీకెండ్ లో 'అనంతగిరి హిల్స్' వెళ్లొద్దామా..! వన్ డే ట్రిప్ ప్యాకేజీ వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 13, 2024 04:04 PM IST

Telangana Tourism Ananthagiri Hills Tour : హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో అరకు లోయను తలపించే అనంతగిరి హిల్స్(Ananthagiri Hills Tour) ఉన్నాాయి. పర్యాటక వినోదానికి కేరాఫ్ గా ఉన్న ఈ ప్రాంతాన్ని చూసేందుకు తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి…..

అనంతగిరి టూర్ ప్యాకేజీ
అనంతగిరి టూర్ ప్యాకేజీ

Hyderabad Ananthagiri Hills Tour : అనంతగిరి హిల్స్.... హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండే ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే...ఈ ప్రాంతాన్ని తెలంగాణ అరకులోయగా అభివర్ణించవచ్చు. ఇక్కడి పచ్చదనం, లోయలు, జలపాతాలు చూస్తే... ప్రతి మనసును కట్టిపడేస్తాయి. అరకు లోయను తలపించే ఇక్కడి హిల్స్(Ananthagiri Hills Tour) అద్భుతంగా ఉంటాయి. గత కొంతకాలంగా ఇక్కడ మౌలిక వసతులతో పాటు వచ్చే టూరిస్టుల సంఖ్య గణంగా పెరుగుతోంది. అయితే ఈ ప్రాంతాన్ని చూసేందుకు తెలంగాణ టూరిజం వన్ డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తుంది. ఒక్కరోజులోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి వారంలో శనివారం, ఆదివారం తేదీల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

yearly horoscope entry point

అనంతగిరి హిల్స్ టూర్ షెడ్యూల్ :

  • ‘HYDERABAD TO ANANTHAGIRI  BACK ONE DAY PACKAGE TOUR’ పేరుతో తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది.
  • ఈ ప్యాకేజీని హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేస్తుంది.
  • ప్రతి వీకెండ్ లోని శని, ఆదివారం తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • కేవలం ఒక్క రోజులోనే ట్రిప్ ముగుస్తుంది. 
  • టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 1800, పిల్లలకు రూ. 1440గా ఉంది.
  • నాన్ ఏసీ బస్సులో వెళ్లాల్సి ఉంటుంది.
  • ఉదయం 09 గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది.
  • మధ్యాహ్నం 12 గంటలకు అనంతగిరి చేరుకుంటారు.
  • మొదటగా అనంత పద్మనాభస్వామిని దర్శించుకుంటారు.
  • 12.30 PM to 01.30 PM - ఫారెస్ట్ విజిట్ ఉంటుంది.
  • 01.30 PM to 02.30 PM - హరిత హోటల్ లో లంచ్ ఉంటుంది.
  • 02.30 PM to 04.30 PM - గేమ్స్ ఉంటాయి.
  • 04.30 PM to 05.00 PM - టీ, స్నాక్స్ ఇస్తారు.
  • 05.00 PM - అనంతగిరి నుంచి బయల్దేరుతారు.
  • 08.00 PM - హైదరాబాద్ చేరుకోవటంతో ఈ ట్రిప్ ముగుస్తుంది. 
  • బుకింగ్ కోసం 9848540371 ఫోన్ నెంబర్ లేదా https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. 

అరుణాచలం టూర్ ప్యాకేజీ

Telangana Tourism Arunachalam Tour: ఇక ఈ సమ్మర్ లో అరుణాచలం వెళ్లాలని అనుకుంటున్నారా..? మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం తీసుకెళ్తోంది. 4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది. ప్రస్తుతం ఏప్రిల్ 21వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ వివరాలు

  • HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించారు.
  • హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు.
  • ప్రస్తుతం ఏప్రిల్ 21వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆ తర్వాత మేలో 20వ తేదీ, జూన్ లో 19వ తేదీన అందుబాటులో ఉంది.
  • పెద్దలకు రూ. 7500, పిల్లలకు రూ. 6వేల టికెట్ ధరగా నిర్ణయించారు.
  • ఫస్డ్ డే సాయంత్రం 6:30 నుంచి బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
  • మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
  • మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. Sripuram Golden Temple Darshan ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.
  • నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

Whats_app_banner