తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Kerala Tour : 5 రోజుల కేరళ ట్రిప్ - వాటర్ ఫాల్స్, మెరైన్ డ్రైవ్ తో పాటు ఈ ప్లేస్ లన్నీ చూడొచ్చు, తాజా ప్యాకేజీ ఇదే

IRCTC Kerala Tour : 5 రోజుల కేరళ ట్రిప్ - వాటర్ ఫాల్స్, మెరైన్ డ్రైవ్ తో పాటు ఈ ప్లేస్ లన్నీ చూడొచ్చు, తాజా ప్యాకేజీ ఇదే

15 June 2024, 12:59 IST

google News
    • IRCTC Hyderabad Kerala Tour : హైదరాబాద్ నుంచి కేరళకు IRCTC టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…… 
హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీ

IRCTC Hyderabad Kerala Tour : కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? తక్కువ ధరతో పాటు తక్కువ టైంలోనే ఎక్కువ ప్లేస్ లు చూడాలనుకుంటున్నారా..? అయితే మీకు ఐఆర్ సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. మీలాంటి వారి కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు.

హైదరాబాద్ - కేరళ ట్రిప్ వివరాలు:

  • హైదరాబాద్ నుంచి కేరళకు IRCTC 'టూరిజం కొత్త ప్యాకేజీని ప్రకటించింది.
  • CULTURAL KERALA-MONSOON MAGIC (SHA49) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
  • ఫ్లైట్ జర్నీ ఉంటుంది. ప్రస్తుతం ఆ ప్యాకేజీ ఆగస్టు 13, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీని ప్రకటిస్తారు.
  • ఈ టూర్ లో కొచ్చి, కుమరకోమ్స మున్నార్, త్రివేండంలోని టూరిస్ట్ ప్రాంతాలను చూపిస్తారు.
  • Day 1: హైదబాద్ నుంచి కొచ్చికి శంషాబాద్ ఎయర్ పోర్ట్ నుంచి వెళ్తారు. అక్కడ్నుంచి హోటల్ కు వెళ్తారు. కొచ్చిలోని ఫోర్ట్ ను సందర్శిస్తారు. సాయంత్రం మెరైన్ డ్రైవ్ ఉంటుంది. రాత్రి కొచ్చిలోనే ఉంటారు. 
  • Day 2: కొచ్చి నుంచి మున్నార్ వెళ్తారు.  Cheeyapara Waterfalls ను సందర్శిస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం చూస్తారు. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.
  • Day 3: మూడో రోజు కూడా మున్నార్ లోనే ఉంటారు.  Mettupetty డ్యామ్ కు వెళ్తారు. ఆ తర్వాత ఏకో పాయింట్ వ్యూ, కుండ్ల డ్యామ్ లేక్ చూస్తారు. రాత్రి ఇక్కడే ఉంటారు.
  • Day 4: మున్నార్ నుంచి కుమరకోమ్సకు వెళ్తారు. హోటల్ కు వెళ్లి ఫ్రెషప్ అయిన తర్వాత.. బ్యాక్ వాటర్ అందాలను వీక్షిస్తారు. 
  • Day 5: త్రివేండ్రం బయల్దేరుతారు.  Jatayu Earth Centre ను సందర్శిస్తారు. త్రివేండ్రంలోని పలు ప్రాంతాలను చూస్తారు.
  • Day 6 -త్రివేండ్రంలోని అనంతపద్మనాభస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత Napier Museum, Azhimala Shiva Statueను చూస్తారు. రాత్రికి త్రివేండ్రం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.
  • ఈ ప్యాకేజీ ధరలు చూస్తే  Comfort క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి రూ. 47700గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీ 33800, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.  32700గా ఉంది.
  • 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.
  • ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవటంతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవటానికి https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA49 వెబ్ సైట్ లోకి వెళ్లొచ్చు.
  • ఈమెయిల్ అడ్రస్ - bsashidhar5605@irctc.com
  • ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 నెంబర్ ను సంప్రదించవచ్చు.

 

తదుపరి వ్యాసం