IRCTC Kerala Tour Package : అలెప్పి, కొచ్చి, మున్నార్-హౌస్ బోట్ స్టేతో కేరళ ట్రిప్, ఐఆర్సీటీసీ 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే
IRCTC Kerala Tour Package : ఈ వర్షాకాలంలో కేరళ అందాలను వీక్షించాలనుకుంటున్నారా? అయితే త్రివేండ్రం నుంచి ఐఆర్సీటీసీ 5 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. అలెప్పీ, కొచ్చి, మున్నార్ లో ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.
IRCTC Kerala Tour Package : ఈ రెయినీ సీజన్ లో కేరళలో చక్కర్లు కొట్టాలనుకుంటున్నారా? అయితే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఐఆర్సీటీసీ ఎగ్జొటిక్ కేరళ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. కేరళ రాజధాని త్రివేండ్రం నుంచి రోడ్ ట్రిప్, హౌస్ బోట్ స్టేతో అలెప్పి, కొచ్చి, కోవలం, కుమరకోమ్, మున్నార్, తేక్కడి ప్రాంతాల్లో 5 రోజులు టూర్ అందిస్తోంది.
టూర్ ప్లాన్ : జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్
ఒక్కో వ్యక్తికి బుక్కింగ్ ధర ( 01 జూన్ 2024 నుంచి 27 సెప్టెంబర్ 2024 వరకు)
క్లాస్ | సింగిల్ ఆక్యుపెన్సీ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 years) | చైల్డ్ వితవుట్ బెడ్ (5-11 years) |
కంఫర్ట్ | రూ.51,190 | రూ.26335 | రూ.19675 | రూ.7160 | రూ.4030 |
టూర్ సర్క్యూట్ : త్రివేండ్రం/ కోవలం(1) - అలెప్పి/కుమరకోమ్ (1) - తేక్కడి (1) - మున్నార్ (1) - కొచ్చి : (5రోజులు/ 4 రాత్రులు)
డే 1 : త్రివేండ్రం
కేరళ రాజధాని త్రివేండ్రం ఎయిర్ పోర్టు/త్రివేండ్రం రైల్వే స్టేషన్/కొచువేలి రైల్వే స్టేషన్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకుంటారు. కోవలంలోని హోటల్ కు తీసుకెళ్తారు. సాయంత్రం అజిమల శివుని విగ్రహాన్ని సందర్శించి, ఆపై కోవలం బీచ్ సందర్శన ఉంటుంది. త్రివేండ్రం/కోవలంలో రాత్రి బస చేస్తారు.
డే 2 : త్రివేండ్రం - అలెప్పి /కుమరకోమ్
ఉదయం పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి, తర్వాత కుమరకోమ్‌కి బయలుదేరతారు. కేరళ బ్యాక్ వాటర్ క్రూయిజ్ కోసం హౌస్ బోట్‌లో ప్రయాణం ఉంటుంది. హౌస్ బోట్ డైనింగ్‌లో అల్పాహారం, లంచ్, డిన్నర్‌ను ఆస్వాదించవచ్చు. అలెప్పి/ కుమరకోమ్‌లోని హౌస్ బోట్‌లో రాత్రి బస ఉంటుంది.
[క్రూజ్ టైమింగ్: -మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 1.30 గంటల వరకు, తర్వాత లంచ్ కోసం 30 నిమిషాల విరామం, మళ్లీ 3.00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రయాణం. ఆ తర్వాత సరస్సు ఒడ్డున నిర్దేశించిన ప్రదేశంలో పడవను నిలుపుతారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5:30 గంటల తర్వాత క్రూజింగ్ అనుమతించరు. మరుసటి రోజు ఉదయం 08:00 గంటల నుంచి 09:00 గంటల మధ్య హౌస్‌బోట్ నుంచి చెక్-అవుట్ చేస్తారు.
డే 3 : అలెప్పి /కుమురకోమ్ - తేక్కడి
మార్నింగ్ డ్రైవ్ చేసి తేక్కడికి చేరుకుంటారు. మార్గమధ్యలో సుగంధ తోటలను సందర్శించవచ్చు. తేక్కడిలోని హోటల్‌కు చెక్ ఇన్ చేస్తారు. పెరియార్ సరస్సు వద్ద బోటింగ్ ఉంటుంది. తేక్కడిలో రాత్రి బస ఉంటుంది.
డే 4 : తేక్కడి - మున్నార్
మున్నార్‌కు బయలుదేరతారు. మున్నార్ లోని హోటల్ చెక్ ఇన్ చేస్తారు. మున్నార్ లో విశాలమైన టీ తోటలు, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండలా డ్యామ్, సరస్సు సందర్శిస్తారు. మున్నార్‌లో రాత్రి బస చేస్తారు.
డే 6 : మున్నార్ - కొచ్చిన్
ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శించి, తర్వాత కొచ్చికి బయలుదేరతారు. సాయంత్రం ఎర్నాకులం రైల్వే స్టేషన్ / కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో పర్యాటకులను డ్రాప్ చేస్తారు.
కేరళ టూర్ ప్యాకేజీ బుక్కింగ్, పూర్తి వివరాల కోసం ఈ కింద లింక్ పై క్లిక్ చేయండి.
సంబంధిత కథనం