తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tirumala Tour 2024 : 'సప్తగిరి' టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే తిరుమలతో పాటు ఈ టెంపుల్స్ వెళ్లొచ్చు, వివరాలివే

IRCTC Tirumala Tour 2024 : 'సప్తగిరి' టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే తిరుమలతో పాటు ఈ టెంపుల్స్ వెళ్లొచ్చు, వివరాలివే

14 March 2024, 17:19 IST

google News
    • IRCTC Tirumala Tour Package 2024: తిరుమల శ్రీవారితో పాటు మరికొన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించుకునేందుకు సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. కరీంనగర్ సిటీ నుంచి ‘సప్తగిరి’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. వివరాలు ఇక్కడ చూడండి...
తిరుమల టూర్ ప్యాకేజీ
తిరుమల టూర్ ప్యాకేజీ (Unshplash.com)

తిరుమల టూర్ ప్యాకేజీ

IRCTC Karimnagar Tirumala Tour Package 2024: ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే అతి తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం(IRCTC Tourism). దేశవ్యాప్తంగానూ పలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఏపీలోని తిరుమల శ్రీవారి(Tirumala) దర్శనంతో పాటు కాణిపాకం, తిరుచానూరు, తిరుపతి వంటి ప్రాంతాలను దర్శించుకునేందుకు సప్తగిరి పేరుతో టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని కరీంనగర్ పట్టణం నుంచి ఆపరేట్ చేస్తుంది.

ఈ సప్తగిరి టూర్ ప్యాకేజీ ప్రస్తుతం మార్చి 28, 2024వ తేదీన అందుబాటులో ఉంది. నాలుగు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. కరీంనగర్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. పెద్దపల్లి, వరంగల్ రైల్వే స్టేషన్లలో కూడా రైలు ఎక్కే అవకాశం ఉంది.

సప్తగిరి టూర్ ప్యాకేజీ షెడ్యూల్….

Day 1 - కరీంనగర్ నుంచి రాత్రి 07.15 గంటలకు రైలు( (Train No. 12762) ) బయల్దేరుతుంది. పెద్దపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఎక్కేవారు రాత్రి 8.05 నిమిషాలకు, వరంగల్ వద్ద రాత్రి 9.15, ఖమ్మం వద్ద 11 గంటలకు రైలు స్టేషన్ కు చేరుకుంటుంది. బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఆయా స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు. రాత్రి మొత్తం జర్నీ చేస్తారు.

Day 02: ఇక రెండో రోజు ఉదయం 07.50 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం శ్రీకాళహస్తీ, తిరుచానూరు ఆలయాలకు వెళ్తారు. తిరిగి హోటల్ కు చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.

Day 03: ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ అవుతారు. ఉదయం 08.30 గంటలకు తిరుమల చేరుకుంటారు. ప్రత్యేక దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.15 గంటలకు(ట్రైన్ నెంబర్. 12761 Express ) తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Day 04: తెల్లవారుజామున ఉదయం 03.26 గంటలకు ఖమ్మం, 04.41 గంటలకు వరంగల్, 05.55 గంటలకు పెద్దపల్లి, ఉదయం 08.40 నిమిషాలకు కరీంనగర్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

సప్తగిరి టూర్ ప్యాకేజీ ధరలు….

IRCTC SAPTHAGIRI Tour Package 2024: ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 9,010 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 7640 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.7560గా ఉంది. ఈ ధరలు Comfort (3A)లో అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ రూ. 7120 ధర ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 5740, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5660గా నిర్ణయించారు.5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు నిర్ణయించారు.ఈ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. టూర్ ప్యాకేజీని https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం