IRCTC Punya Kshetra Yatra : రూ.15 వేలకే పూరి, కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాల దర్శనం-ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ-irctc tour package punya kshetra yatra puri kashi ayodhya bharat gaurav tourist train in 9 days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Punya Kshetra Yatra : రూ.15 వేలకే పూరి, కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాల దర్శనం-ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ

IRCTC Punya Kshetra Yatra : రూ.15 వేలకే పూరి, కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాల దర్శనం-ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ

Bandaru Satyaprasad HT Telugu
Mar 13, 2024 01:26 PM IST

IRCTC Punya Kshetra Yatra : 9 రోజుల్లో పూరి, కాశీ, అయోధ్య సహా మరికొన్ని పుణ్య క్షేత్రాలను చూసేందుకు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 23న టూర్ ప్రారంభం కానుంది. ఈ టూర్ ప్యాకేజీలో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ లో పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చు.

రూ.15 వేలకే పూరి, కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాల దర్శనం
రూ.15 వేలకే పూరి, కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాల దర్శనం

IRCTC Punya Kshetra Yatra : 9 రోజుల్లో పూరి, కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాలను(IRCTC Punya Kshetra Yatra) దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ ప్యాకేజీ (IRCTC Tour Package)అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో పూరి-కోణార్క్-గయ-వారణాసి - అయోధ్య - ప్రయాగ్‌రాజ్ కవర్ చేస్తారు. భారత్ గౌరవ్ టూరిస్ట్(Bharat Gaurav Tourist Train) ట్రైన్ లో 2AC, 3AC, SL తరగతులలో "పుణ్య క్షేత్ర యాత్ర: పూరి-కాశీ-అయోధ్య" టూర్ ప్యాకేజీని ఐదుగురు పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చు. 9 రోజుల పర్యటనలో ఆరు ముఖ్యమైన ప్రదేశాలను చూడొచ్చు.

పుణ్య క్షేత్ర యాత్ర పురి-కాశీ-అయోధ్య ప్యాకేజీ వివరాలు(Tour Package Details)

  • టూర్ కోడ్ : SCZBG20
  • వ్యవధి : 8 రాత్రులు/ 9 రోజుల
  • టూర్ మొదలయ్యే తేదీ : 23.03.2024
  • ప్రయాణం : సికింద్రాబాద్ - పూరి - కోణార్క్ - గయ - వారణాసి - అయోధ్య - ప్రయాగ్ రాజ్
  • మొత్తం సంఖ్య సీట్లు : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)
  • బోర్డింగ్ / డీ బోర్డింగ్ స్టేషన్లు : సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం

టూర్ ధర (ప్రతి వ్యక్తికి)

వర్గండబుల్/ట్రిపుల్ షేర్పిల్లలు(5-11 సంవత్సరాలు)
ఎకానమీ క్లాస్రూ.15,100రూ.14,100
స్టాండర్డ్ క్లాస్రూ.24,000రూ.22,800
కంఫర్డ్ క్లాస్రూ.31,400రూ.29,900

ఈ టూర్ లో కవర్ చేసే ప్రదేశాలు (Temples coverage)

  • పూరి : జగన్నాథ దేవాలయం, కోణార్క్ సూర్య దేవాలయం
  • గయ : విష్ణుపాద ఆలయం
  • వారణాసి : కాశీ విశ్వనాథ దేవాలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయం. సాయంత్రం గంగా హారతి
  • అయోధ్య : సరయు నది వద్ద రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి, హారతి
  • ప్రయాగరాజ్: త్రివేణి సంగమం
  • టూర్ ప్యాకేజీ మినహాయింపులు

మాన్యుమెంట్ ప్రవేశ ఛార్జీలు, బోటింగ్, సాహస క్రీడలు మొదలైనవి. భోజనం ముందే సెట్ చేస్తారు. ఏదైనా రూమ్ సర్వీస్ కు ఛార్జీ చేస్తారు. స్థానిక గైడ్‌ల ఖర్చు ప్రయాణంలో చేర్చరు. లాండ్రీ ఖర్చులు, వైన్‌లు, మినరల్ వాటర్, ఆహారం, పానీయాలు వంటి ఏదైనా వ్యక్తిగత ఖర్చులు సాధారణ మెనుల్లో ఉండవు.

ప్రయాణికులకు ముఖ్య గమనిక

ప్రయాణికులు ఓటరు ID/ఆధార్ కార్డ్, కోవిడ్-19 ఫైనల్ డోస్ సర్టిఫికేట్‌ను తమ వెంట తీసుకెళ్లాలి. ఈ టూర్ ప్యాకేజీకి ఎల్టీసీ అప్రూవ్ (LTC Approved)చేస్తారు. సింగిల్‌గా బుక్ చేసుకున్న ప్రయాణికుడు ఇతర ప్రయాణికులతో డబుల్ ఆక్యుపెన్సీ లేదా ట్రిపుల్ ఆక్యుపెన్సీలో పంచుకోవాలి. ఆలయ దర్శనం, స్మారక చిహ్నాల సందర్శన కోసం COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్(Covid Certificate) తప్పనిసరి. ప్రయాణికులు టూర్ సమయంలో టీకా ధృవీకరణ పత్రాన్ని హార్డ్ కాపీలో లేదా ఫోన్‌లో ఉంచుకోవాలి. టూర్ కి బయలుదేరడానికి 03-04 రోజుల ముందు సీటింగ్ అమరిక ఖరారు చేస్తారు. ఈ టూర్ 23.03.2024 మొదలై 31.03.2024న ముగుస్తుంది.

సంబంధిత కథనం