IRCTC Divya Dakshin Yatra : 9 రోజుల్లో 7 దివ్య క్షేత్రాల సందర్శన- అతి తక్కువ ధరలో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ-secunderabad news in telugu irctc divya dakshin yatra 9 days 7 temples visit ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Divya Dakshin Yatra : 9 రోజుల్లో 7 దివ్య క్షేత్రాల సందర్శన- అతి తక్కువ ధరలో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Divya Dakshin Yatra : 9 రోజుల్లో 7 దివ్య క్షేత్రాల సందర్శన- అతి తక్కువ ధరలో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Bandaru Satyaprasad HT Telugu
Feb 05, 2024 07:39 PM IST

IRCTC Divya Dakshin Yatra : దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలతో పాటు దివ్య క్షేత్రాలను సందర్శించేలా ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 9 రోజుల్లో 7 ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Divya Dakshin Yatra : ఐఆర్సీటీసీ(IRCTC) అతి తక్కువ ధరలో "జ్యోతిర్లింగ దివ్య దక్షిణ్ యాత్ర" టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ యాత్రలో 9 రోజుల్లో(8 రాత్రులు/9 రోజులు) ఏడు దివ్య క్షేత్రాలను సందర్శించవచ్చు. తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం,తిరుచ్చి, తంజావూరు దివ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతులలో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ ట్రైన్ ద్వారా "జ్యోతిర్లింగ దివ్య దక్షిణ్ యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు https://www.irctctourism.com/tourpkgs వెబ్ సైట్ లో ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

టూర్ ప్యాకేజీ వివరాలు

 • టూర్ పేరు- జ్యోతిర్లింగంతో దివ్య దక్షిణ యాత్ర
 • టూర్ వ్యవధి - 8 రాత్రులు/9 రోజులు
 • పర్యటన తేదీ - 24.02.2024
 • కవర్ చేసే దివ్యక్షేత్రాలు - తిరువణ్ణామలై (అరుణాచలం) - రామేశ్వరం - మధురై - కన్యాకుమారి - త్రివేండ్రం - తిరుచ్చి - తంజావూరు
 • అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య : 716 (SL- 460, 3AC- 206, 2AC- 50)
 • బోర్డింగ్ / డి-బోర్డింగ్ స్టేషన్లు - సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లు

టూర్ ప్యాకేజీ ధర ( GSTతో సహా)

 • ఎకానమీ కేటగిరి- రూ. 14,100(డబుల్ / ట్రిపుల్ షేర్)- రూ. 13,100( పిల్లలు(5-11 సంవత్సరాలు))
 • స్టాండర్డ్ కేటగిరి- రూ. 21,500(డబుల్ / ట్రిపుల్ షేర్)- రూ. 20,400( పిల్లలు(5-11 సంవత్సరాలు))
 • కంఫర్ట్ కేటగిరి- రూ. 27,900(డబుల్ / ట్రిపుల్ షేర్)-రూ. 26,500( పిల్లలు(5-11 సంవత్సరాలు))
 • సింగిల్‌గా బుక్ చేసుకున్న ప్రయాణికుడు ఆక్యుపెన్సీని ఇతర ప్రయాణికులతో షేరింగ్ ప్రాతిపదికన డబుల్ ఆక్యుపెన్సీ లేదా ట్రిపుల్ ఆక్యుపెన్సీలో పంచుకోవాల్సి ఉంటుంది.

ఈ టూర్ లో కవర్ అయ్యే ప్రదేశాలు

 • తిరువణ్ణామలై - అరుణాచలం ఆలయం
 • రామేశ్వరం- రామనాథస్వామి ఆలయం
 • మధురై- మీనాక్షి అమ్మవారి ఆలయం
 • కన్యాకుమారి- రాక్ మెమోరియల్, కుమారి అమ్మవారి ఆలయం
 • త్రివేండ్రం- శ్రీ పద్మనాభస్వామి ఆలయం
 • తిరుచ్చి - శ్రీ రంగనాథస్వామి ఆలయం
 • తంజావూరు - బృహదీశ్వరాలయం
 • ప్రయాణికులకు ఐఆర్సీటీసీ కల్పించే వసతులు
 • ఉదయం టీ, టిఫెన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం (శాఖాహారం మాత్రమే).
 • ప్రయాణికులకు ప్రయాణ బీమా కల్పిస్తుంది.
 • అవసరమైన సహాయం కోసం ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్లు టూర్ అంతటా అందుబాటులో ఉన్నారు.

ప్యాకేజీ నుంచి మినహాయింపులు

 • మాన్యుమెంట్ ప్రవేశ ఛార్జీలు, బోటింగ్, సాహస క్రీడలకు వ్యక్తిగతంగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.
 • భోజనం ముందే సెట్ చేస్తారు. మెను ఎంపిక అందుబాటులో ఉండదు.
 • రూమ్ సర్వీస్ కు ఛార్జీ విధిస్తారు.
 • ప్రవేశ ఛార్జీలు, స్థానిక గైడ్‌ల ఛార్జీలు మొదలైనవి టూర్ ప్యాకేజీలో చేర్చలేదు.
 • డ్రైవర్లు, వెయిటర్‌లు, గైడ్స్ లకు టిప్స్, ఇంధన సర్‌ఛార్జ్ టూర్ ప్యాకేజీలో ఉండవు.
 • లాండ్రీ ఖర్చులు, వైన్‌లు, మినరల్ వాటర్, ఆహారం, డ్రింక్స్ ఇతర వ్యక్తిగత ఖర్చులు ట్యూర్ ప్యాకేజీ నుంచి మినహాయించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం