Ayodhya Ram Mandir latest news : ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో కొత్తగా ప్రారంభమైన రామ మందిర సందర్శనానికి వెళుతున్న భక్తులకు ముఖ్యమైన గమనిక! రామ మందిరం రోజుకు 1 గంట పాటు మూతపడి ఉంటుంది. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు.
హిందువుల శతాబ్దాల కల.. అయోధ్యలో రామ మదిరం.. జనవరి 22న అట్టహాసంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి వేలాది మంది భక్తులు.. మందిరాన్ని, రామ్ లల్లా విగ్రహాన్ని దర్శించుకున్నారు. జనవరి 23 నుంచి రామ మందిరంలో దర్శన సమయాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండేవి. కానీ రోజురోజుకు పెరుగుతన్న రద్దీ నేపథ్యంలో.. రామ్ లల్లా దర్శన టైమింగ్స్‌ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగించారు. ఈ టైమింగ్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో.. ప్రతి రోజు ఒక గంట పాటు ఆలయం మూతపడి ఉంటుంది.
Ayodhya Ram Lalla Darshan : "శ్రీ రామ్ లల్లా వయస్సు 5ఏళ్లు మాత్రమే. చిన్న బాలుడు. అంత ఒత్తిడి తీసుకోలేడు. అంత సేపు మేలుకుని ఉండలేడు. అందుకే.. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు దర్శనాలను నిలిపివేస్తున్నాము," అని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
జనవరి 23 నుంచి రామ్ లల్లా విగ్రహానికి తెల్లవారుజామున 4 గంటల నుంచి పూజలు జరుగుతున్నాయి. 2 గంటల పాటు ప్రత్యేక పూజలు సాగుతాయి. అనంతరం భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు.
Ayodhya Ram Lalla Darshan timings : అంటే.. అయోధ్య రామ మందిర దర్శనం కోసం వెళుతున్న వారికి.. ఇక ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయం ఉంటుంది. మధ్యలో గంట సేపు బ్రేక్ ఉంటుందని గుర్తుపెట్టుకుని, ట్రిప్‌ని ప్లాన్ చేసుకోవాలి.
మరోవైపు.. గత సోమవారం ఆయోధ్య రామ మందిరానికి వెళ్లారు దిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మన్. కుటుంబంతో కలిసి రామ్ లల్లాను దర్శించుకున్నారు. వాస్తవానికి.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానం అందింది. కానీ తన కుటుంబంతో కలిసి వెళతానని చెప్పిన కేజ్రీవాల్.. ప్రారంభోత్సవానికి వెళ్లలేదు.
సంబంధిత కథనం
టాపిక్