తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Airport: అలర్ట్... ఈ నెల 28 నుంచే కొత్త అంతర్జాతీయ టెర్మినల్‌ స్టార్ట్..

Hyd Airport: అలర్ట్... ఈ నెల 28 నుంచే కొత్త అంతర్జాతీయ టెర్మినల్‌ స్టార్ట్..

HT Telugu Desk HT Telugu

26 November 2022, 17:54 IST

google News
    • RGIA Hyderabad: ఈ నెల 28 నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ప్రధాన టెర్మినల్‌ ద్వారానే విమాన సర్వీసులు ఉండనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన చేశారు.
శంషాబాద్‌లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్‌
శంషాబాద్‌లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్‌ (RGIA)

శంషాబాద్‌లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్‌

New Terminal at Rajiv Gandhi International Airport Hyd: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 28 నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన టెర్మినల్‌ ద్వారానే విమాన సర్వీసులు ఉంటాయని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రయాణికులు కొత్త టెరి్మనల్‌లోని డిపార్చర్‌ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎయిర్ పోర్టు అధికారులు ట్వీట్ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానంతో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.

మొదటి అంతర్జాతీయ విమానం SV-753 కొత్త డిపార్చర్ హాల్ నుంచి సాయంత్రం 5.30 గంటలకు టేకాఫ్ అవుతుంది, ఈ కొత్త అంతర్జాతీయ డిపార్చర్ హాల్ ప్రారంభంతో, ప్రస్తుత ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ (ఐఐడీటీ) రద్దు చేయబడుతుంది.

తదుపరి సమాచారం కోసం విమానాశ్రయ వెబ్‌సైట్ www.hyderabad.aeroని సందర్శించాలని లేదా విమానాశ్రయ సమాచార డెస్క్‌ని +91-40-66546370లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

దేశంలో మొట్టమొదటిసారి పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం నమూనాలో జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో మొదలైంది. అప్పట్లో కోటి 20లక్షల మంది విమాన ప్రయాణీకులు రాకపోకలకు సరిపడా సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలల్లో ప్రయాణించిన విమాన ప్రయాణీకులు సగటును 20శాతం వృద్ధి నమోదు చేసింది. అయితే రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో...విస్తరణ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కొత్త అంతర్జాతీయ టెర్మినల్ ను నిర్మించింది.

దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పేపర్‌లెస్‌ ఈ బోర్డింగ్‌ సౌకర్యం కలిగిన ఏకైక విమానాశ్రయం కూడా హైదరాబాద్‌ విమానాశ్రయమదే. పర్యావరణ అనుకూల కార్యకలాపాలను నిర్వహించేందుకు పది మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు ప్లాంట్‌, గ్రీన్‌ ప్యాసెంజర్‌ టెర్మినల్‌ భవనాలు, కార్బన్‌ ఉద్గారాలను తగ్గించేందుకు వీలుగా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.

తదుపరి వ్యాసం