International airport renamed: అంతర్జాతీయ విమానాశ్రయానికి విప్లవ వీరుడి పేరు-chandigarh international airport renamed after bhagat singh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  International Airport Renamed: అంతర్జాతీయ విమానాశ్రయానికి విప్లవ వీరుడి పేరు

International airport renamed: అంతర్జాతీయ విమానాశ్రయానికి విప్లవ వీరుడి పేరు

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 03:01 PM IST

International airport renamed: విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్ పేరును ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టాలని నిర్ణయించారు.

<p>షహీద్ భగత్ సింగ్</p>
షహీద్ భగత్ సింగ్

International airport renamed: చండీగఢ్ విమానాశ్రయం పేరును మారుస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దాంతో, చండీగఢ్ ఏర్ పోర్ట్ పేరును షహీద్ భగత్ సింగ్ ఏర్ పోర్ట్ గా మార్చారు.

International airport renamed: ముఖ్య అతిథి నిర్మల

చండీగఢ్ ఏర్ పోర్ట్ లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చండీగఢ్ విమానాశ్రాయానికి గొప్ప స్వతంత్ర యోధుడైన షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టడం సముచిత నిర్ణయమన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి వీకే సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మన్, తదితరులు పాల్గొన్నారు.

International airport renamed: మన్ కీ బాత్ లో చెప్పారు

గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడైన షహీద్ భగత్ సింగ్ పేరును చండీగఢ్ విమానాశ్రయానికి పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ ఈ అదివారం నాటి మన్ కీ బాత్ లో వెల్లడించారు. ఇది ఆ అసమాన యోధుడికి నిజమైన నివాళి అవుతుందన్నారు. సెప్టెంబర్ 28, బుధవారం షహీద్ భగత్ సింగ్ 115వ జయంతి.

International airport renamed: థాంక్యూ పీఎం జీ..

చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించిన ప్రధానికి పంజాబ్ సీఎం భగవంత్ మన్ ధన్యవాదాలు తెలిపారు. చాలా రోజులుగా తాము ఈ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విషయంలో సహకరించిన హరియాణా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. భగత్ సింగ్ ను స్వతంత్ర సమర యోధుడిగానే కాకుండా, అన్యాయానికి, అసమానతలకు ఎదురొడ్డి పోరాడిన యోధుడిగా గుర్తుంచుకోవాలన్నారు. ఆయన దేశ భక్తిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

Whats_app_banner