Awards for HYD : హైదరాబాద్ కు రెండు అంతర్జాతీయ అవార్డులు
Awards for HYD హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు-2022తో పాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ & ఇన్ క్లూసివ్ గ్రోత్ అవార్డు దక్కింది. భాగ్య నగరానికి రెండు అంతర్జాతీయ అవార్డులు లభించడంతో పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ సి ఎస్ & HMDA కమిషనర్ అర్వింద్ కుమార్ ను మంత్రి కె. టి. ఆర్ అభినందించారు.
Awards for HYD దక్షిణ కొరియాలోని జెజులో శుక్రవారం జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (AIPH) 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ 'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022' మరియు 'లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్' విభాగంలో మరో అవార్డును గెలుచుకుంది.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ‘వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డ్స్ 2022’ కోసం ఆరు కేటగిరీల్లో ఎంట్రీలను ఆహ్వానించింది. ఆరు కేటగిరీల్లో మొత్తం 18 మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు. ఫైనల్ కేటగిరీల వారీగా విజేతలను ప్రకటించారు. 6 కేటగిరీలు మరియు షార్ట్ లిస్ట్ చేయబడిన దేశాల జాబితా విడుదల చేశారు.
1. జీవవైవిధ్యం కోసం లివింగ్ గ్రీన్ - కొలంబియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్
2. శీతోష్ణస్థితి మార్పు కోసం లివింగ్ గ్రీన్ - టర్కీ, ఆస్ట్రేలియా, మెక్సికో
3. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం లివింగ్ గ్రీన్ - బ్రెజిల్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా
4. నీటి కోసం లివింగ్ గ్రీన్ - కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
5. లివింగ్ గ్రీన్ ఫర్ సోషల్ కోహెషన్ -అర్జెంటీనా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్
6. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ & ఇన్‌క్లూజివ్ గ్రోత్- కెనడా, ఇరాన్, ఇండియాలను ఎంపిక చేశారు.
ఈ అవార్డుల్లో హైదరాబాద్ మాత్రమే భారత్ నుంచి ఎంపికైంది. భారతీయ నగరం మరియు హైదరాబాద్ కేటగిరీ అవార్డు మాత్రమే కాకుండా మొత్తం ‘వరల్డ్ గ్రీన్ సిటీ 2022’ అవార్డును గెలుచుకోవడం హైదరాబాద్, తెలంగాణ మరియు భారతదేశానికే గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్ నగరం 6వ ఉత్తమ కేటగిరీలో ఎంపిక అయింది.
‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్’ కేటగిరీలో, ఔటర్ రింగ్ రోడ్‌కు పచ్చదనం హైదరాబాద్ కు ఎంట్రీగా దరఖాస్తు చేశారు. నగరవాసులందరూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి మరియు అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థలు మరియు పరిష్కారాలను రూపొందించడంపై ఈ కేటగిరీ దృష్టి సారించింది. ‘తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్ నెక్లెస్’ అని పిలువబడే ORR పచ్చదనం ఈ విభాగంలో ఉత్తమమైనదిగా ఎంపికైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో,మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామా రావు ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు పొడవునా పచ్చదనం ఉండేలా పెద్దఎత్తున హరితహారం కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం ‘తెలంగాణకు హరితహారం’ (TKHH) ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడంపై చేస్తున్న నిరంతర కృషికి ఈ అవార్డు నిదర్శనమని హెచ్‌ఎండిఏ ప్రకటించింది.
అవార్డు సాధించిన సందర్భంగా MA&UD స్పెషల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్ అర్వింద్ కుమార్, సంస్థ అధికారులు సిబ్బందిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.