తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Saurashtra Tour : హైదరాబాద్ నుంచి సౌరాష్ట్ర టూర్- 8 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే?

IRCTC Saurashtra Tour : హైదరాబాద్ నుంచి సౌరాష్ట్ర టూర్- 8 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే?

22 April 2024, 13:48 IST

google News
    • IRCTC Hyderabad To Saurashtra Tour : ఈ వేసవిలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? అయితే 8 రోజుల సౌరాష్ట్ర టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తోంది. వడోదర, అహ్మదాబాద్, ద్వారక, సోమనాథ్ ను ఈ టూర్ లో విజిట్ చేయవచ్చు.
హైదరాబాద్ నుంచి సౌరాష్ట్ర టూర్
హైదరాబాద్ నుంచి సౌరాష్ట్ర టూర్

హైదరాబాద్ నుంచి సౌరాష్ట్ర టూర్

IRCTC Hyderabad To Saurashtra Tour : హైదరాబాద్ నుంచి సౌరాష్ట్ర 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తోంది. ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ టూర్ అందుబాటులో ఉంది. ప్రారంభ ధర రూ.24,760తో వడోదర, అహ్మదాబాద్, ద్వారక, సోమనాథ్ ప్రదేశాలను సుందర్ సౌరాష్ట్ర టూర్ లో సందర్శించవచ్చు.

టూర్ ఇలా : వడోదర - అహ్మదాబాద్ - రాజ్‌కోట్ - ద్వారక - సోమనాథ్ (7 రాత్రులు / 8 రోజులు)

టూర్ వివరాలు

  • డే 01 : బుధవారం - సికింద్రాబాద్ - పోర్ బందర్ ఎక్స్‌ప్రెస్(రైలు నం. 20967) మధ్యాహ్నం 3:00 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ చేయాలి.
  • డే 02 : గురువారం - వడోదర స్టేషన్ నుంచి ఉదయం 11:00 గంటలకు పికప్ చేస్తారు. అక్కడ నుంచి హోటల్‌కు వెళ్తారు. మధ్యాహ్నం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విజిట్ ఉంటుంది. (విగ్రహం చూసేందుకు టిక్కెట్లు మీరు సొంతంగా బుక్ చేసుకోవాలి. “https://www.soutickets.in/#/dashboard”) తర్వాత వడోదరకి తిరిగి వెళ్తారు. వడోదరలోనే రాత్రి బస ఉంటుంది.
  • డే 03 : శుక్రవారం -లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ ను సందర్శిస్తారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌కు(110 కి.మీ.) బయలుదేరి వెళ్తారు. అక్కడ సబర్మతి ఆశ్రమం, అక్షరధామ్ ఆలయాన్ని సందర్శి్స్తారు. అహ్మదాబాద్ లో హోటల్‌లో చెక్ ఇన్ చేసి నైట్ స్టే చేయాలి.
  • డే 04 : శనివారం - హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి, ద్వారకకు (440 కి.మీ.) బయలుదేరి వెళ్తారు. మార్గంలో జామ్‌నగర్ లఖోటా ప్యాలెస్, మ్యూజియం సందర్శించవచ్చు. సాయంత్రానికి ద్వారకకు చేరుకుంటారు. హోటల్‌లో చెక్ చేసి ద్వారకలో రాత్రి బస చేస్తారు.
  • డే 05 : ఆదివారం - ఉదయం ద్వారకాదీష్ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత బెట్ ద్వారక, నాగేశ్వర్ ఆలయం, శివరాజ్‌పూర్ బీచ్ విజిట్ ఉంటుంది. ద్వారకకి తిరిగి వెళ్తారు. రాత్రి బస ద్వారకలో చేస్తారు.
  • డే 06 : సోమవారం -హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి సోమనాథ్ (240 కి.మీ)కి బయలుదేరతారు. మార్గంలో పోర్ బందర్ కీర్తి మందిర్, సుధామ దేవాలయాన్ని సందర్శిస్తారు. సోమనాథ్ చేరుకున్నాక సోమనాథ్ జ్యోతిర్లింగం, చుట్టుపక్కల దేవాలయాలను సందర్శించవచ్చు. సాయంత్రం పోర్‌బందర్‌కి బయలుదేరతారు. రాత్రి పోర్‌బందర్ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు.
  • డే 07 : మంగళవారం - పోర్ బందర్-సికింద్రాబాద్(రైలు నం. 20968) ఎక్స్‌ప్రెస్ అర్ధరాత్రి 12:50 గంటలకు రైలు ప్రయాణం మొదలవుతుంది.
  • డే 08 : బుధవారం - ఉదయం 08:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.

ఫ్రీక్వెన్సీ : ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి ట్రైన్ టూర్ అందుబాదులో ఉంది.

మొత్తం సీట్ల కోటా : స్లీపర్ నాన్ ఏసీ –06, 3 టైర్ ఏసీ - 04

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్ :

క్లాస్డబుల్ షేరింగ్ట్రిపుల్ షేరింగ్చైల్డ్ విత్ బెడ్(5-11 years )చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 years)
కంఫర్ట్(3AC)రూ.28280రూ.27610రూ.22060రూ.20020
స్టాండర్డ్(SL)రూ.25430రూ.24760రూ.19210రూ.17170

తదుపరి వ్యాసం