తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Edcet Results Out : తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG EDCET Results Out : తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

11 June 2024, 16:55 IST

google News
    • TG EdCET Results Out : తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

TG EDCET Results Out : తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://edcet.tsche.ac.in/ లింక్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఎడ్‌సెట్‌ నిర్వహించారు. ఈ ఫలితాలు మంగళవారం విడుదల్యయాయి. నల్గొండ మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో మే 23న ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి టీజీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నాగర్‌ కర్నూలుకు చెందిన నవీన్‌కు ఫస్ట్ ర్యాంకు సాధించగా, హైదరాబాద్‌కు చెందిన అషిత సెకండ్, మూడో ర్యాంకు శ్రీతేజ సాధించారు. ఈ ఏడాది ఎడ్‌ సెట్‌కు 29,463మంది దరఖాస్తు చేసుకోగా 28,549 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 96.90 శాతం మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో బీఈడీ కళాశాలల్లో మొత్తం 14,285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ర్యాంకు కార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి?

  • అభ్యర్థులు ముందుగా టీజీ ఎడ్ సెట్ https://edcet.tsche.ac.in/ అధికారిక వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత హోంపేజీలో డౌన్ లోడ్ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి
  • తర్వాత పేజీలో అభ్యర్థి ఎడ్ సెట్ హాల్ టికెట్ నెం, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
  • వ్యూ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి.
  • స్క్రీన్ పై విద్యార్థి ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది. ర్యాంకు కార్డును డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఈఏపీసెట్-2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌(AP EAPCET) పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాలు ఉన్నత విద్యామండలి మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఫలితాలు, స్కోర్ కార్డును విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలను కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 ప‌రీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వ‌ర‌కు ప‌రీక్షలు జ‌రిగాయి. ఈ ప‌రీక్షల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది ద‌రఖాస్తు చేసుకోగా, అందులో 3,39,139 మంది ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు. అంటే 93.47 శాతం మంది ప‌రీక్షలు రాశారు. ఇప్పటికే ఈఏపీసెట్ ప్రవేశపరీక్ష ప్రాథమిక కీని ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. వీటిపై మే 26 వరకు అభ్యంతరాలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

తదుపరి వ్యాసం