TS EdCET 2024 : టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తుల సవరణలకు అవకాశం, మే 15 చివరీ తేదీ!
TS EdCET 2024 : టీఎస్ ఎడ్ సెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే అప్లికేషన్లలో సవరణలకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. మే 13-15 మధ్య దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చు.
TS EdCET 2024 : తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ ఎడ్ సెట్-2024 నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు గడువు పూర్తింది. అయితే ఎడ్ సెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్లలో సవరణలకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. మే 13 నుంచి 15 వరకు అభ్యర్థులు కరెక్షన్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఎడ్ సెట్ ను మహాత్మ గాంధీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. మార్చి 4 ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. మార్చి 6 నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. ముందుగా మే 6వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీగా ప్రకటించగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మే 10 వరకు గడువు పెంచారు. అలాగే ఆలస్య రుసుముతో మే 13 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. తాజాగా మే 13 నుంచి 15 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు.
మే 20 నుంచి హాల్ టికెట్లు
టీఎస్ ఎడ్ సెట్ -2024 పరీను మే 23న నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాల్ టికెట్లను https://edcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో మే 20 నుంచి అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. మే 23న రెండు సెషన్లలో కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10-12 గంటలకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2-4 గంటల వరకు నిర్వహిస్తారు.
దరఖాస్తుల సవరణ ఇలా?
- Step 1 : అప్లికేషన్ సవరణకు అభ్యర్థులు ముందుగా https://edcet.tsche.ac.in/ వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.
- Step 2 : ఆ తర్వాత Correction in Your Filled in Application Form అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- Step 3 : అభ్యర్థి అప్లికేషన్ నెంబర్, Payment Reference ID , Qualifying Examination Hall Ticket No , Mobile Numberతో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేశారు.
- Step 4 : ఆ తర్వాత proceed to fill application పై క్లిక్ చేసి దరఖాస్తులో సవరణలు చేసుకోవాలి.
- Step 5 : చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
టీఎస్ ఎడ్ సెట్-2024 ముఖ్యమైన తేదీలివే?
- ఎడ్ సెట్ దరఖాస్తుల స్వీకరణ - మార్చి 6,2024
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - మే 10,2024
- ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - మే 13,2024
- ఎడ్ సెట్ హాల్ టికెట్లు జారీ తేదీ - మే 20, 2024
- ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష తేదీ - మే 23, 2024
- ఎడ్ సెట్ అధికారిక వెబ్ సైట్ - https://edcet.tsche.ac.in/
ఎడ్ సెట్ పరీక్ష విధానం
టీఎస్ ఎడ్ సెట్ ప్రవేశపరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు రెండు సెషన్లలో పేపర్‌ను నిర్వహిస్తారు. మూడు విభాగాలుగా ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఏలో ఇంగ్లిష్, పార్ట్-బిలో టీచింగ్ ఆప్టిట్యూడ్, పార్ట్-సిలో మెథడాలజీపై ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు పార్ట్-సి కోసం ఒక సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా… రెండేళ్ల బీఈడీ, స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
సంబంధిత కథనం