తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Liquor Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఎల్లుండి వైన్ షాపులు బంద్

Liquor Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఎల్లుండి వైన్ షాపులు బంద్

15 April 2024, 18:11 IST

google News
    • Liquor Shops Close : శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 17న హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలు ముసివేయాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
వైన్ షాపులు బంద్
వైన్ షాపులు బంద్

వైన్ షాపులు బంద్

Liquor Shops Close : తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఎల్లుండి(ఏప్రిల్ 17న) శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా జంట నగరాల్లో(హైదరాబాద్, సికింద్రాబాద్) వైన్ షాపులను(Wine Shops Close) ముసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ నెల 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు 24 గంటలు బంద్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్(Hyderabad), సికింద్రాబాద్(Secunderabad)నగరాల్లో శాంతి భద్రతల దృష్ట్యా వైన్ షాపులు(liquor Shops Bandh) మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వైన్ షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. వైన్ షాపులు బంద్ అని తెలియడంతో మందుబాబులు...షాపులకు క్యూ కట్టారు.

తెగతాగేస్తున్నారు

మద్యం ప్రియులకు సమ్మర్(Summer) అంటే గుర్తొచ్చేది చిల్డ్ బీర్(Chilled Beer). సాయంత్రం కూల్ గా ఓ బీర్, కాస్త స్టఫ్ దగ్గర పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటారు. తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. దీంతో మందుబాబులు కూల్ అయ్యేందుకు వైన్ షాపుల(Wine Shops) వైపు అడుగులు వేశారు.అందినకాడికి బీర్లు తాగేశారు. ఒక్కసారిగా బీర్ల కొనుగోలు(Beer Sales) పెరగడంతో...స్టాక్ ఖాళీ అయ్యింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. రేషన్ ఆధారంగా ప్రధాన బ్రాండ్ల బీర్లను ఒక్కో షాపునకు 20-25 కేస్ లు ఇస్తుండగా...ఇవి సరిపోవడంలేదని మద్యం షాపుల యజమానులు అంటున్నారు.

బీర్లకు భారీ డిమాండ్

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు 60 వేల నుంచి 80 వేల కేస్ లకు పైగా బీర్లు (Beers Demand)అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ లో వీటికి అదనంగా మరో 20 వేల కేస్ లు డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం డిమాండ్ కు తగిన స్టాక్ లేకపోవడంతో మద్యం డిపోలు 60 వేల నుంచి 80 వేల కేస్ లను మద్యం షాపులకు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత(Summer Heat) ఎక్కువగా ఉండడంతో...మందుబాబులు బీర్లు లాగించేస్తు్న్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బీర్ల సేల్స్‌ అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీర్లకు డిమాండ్‌ పెరుగుతోందని మద్యం షాపుల నిర్వాహకులు అంటున్నారు. బీర్‌ల కంపెనీల నుంచి రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేస్‌ల స్టాక్ వస్తుందని ఎక్సైజ్‌ శాఖ(Excise Department) వర్గాలు చెబుతున్నాయి. వీటిల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. గత ఏప్రిల్‌ లో హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 12 లక్షల కేస్‌లకు పైగా బీర్ల సెల్స్(Beer Sales) జరిగితే....ప్రస్తుతం 15 లక్షల కేస్‌లకు పైగా డిమాండ్‌ వస్తుందని మద్యం వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేస్ ల బీర్లు విక్రయాలు జరుగుతాయని గణాంకాలు చెబుతున్నాయి.

తదుపరి వ్యాసం