TS Liquor Sales : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, సమ్మర్ ఎఫెక్ట్ తో బీర్ల కొరత-భారీగా పెరిగిన సేల్స్
TS Liquor Sales : తెలంగాణ మందుబాబులకు వింత కష్టం వచ్చింది. మండే ఎండల్లో కూల్ గా గొంతుతడుపుకునేందుకు కాస్త బీర్ చుక్కలు లేకపోయాయి. ఒక్కసారిగా బీర్ల సేల్స్ పెరడగంతో.. కొరత ఏర్పడింది.
TS Liquor Sales : సాయంత్రం చిల్డ్ బీర్ తో చిల్ అవుదాం... మామా? సినిమాలో ఈ డైలాగ్స్ వింటుంటాం. మద్యం ప్రియులకు సమ్మర్(Summer) అంటే గుర్తొచ్చేది చిల్డ్ బీర్(Chilled Beer). సాయంత్రం కూల్ గా ఓ బీర్, కాస్త స్టఫ్ దగ్గర పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటారు. తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. గత వారం రోజుల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. దీంతో మందుబాబులు కూల్ అయ్యేందుకు వైన్ షాపుల(Wine Shops) వైపు అడుగులు వేశారు.అందినకాడికి బీర్లు తాగేశారు. ఒక్కసారిగా బీర్ల కొనుగోలు(Beer Sales) పెరగడంతో...స్టాక్ ఖాళీ అయ్యింది. రాష్ట్రంలోని పలు జిల్లా్ల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. రేషన్ ఆధారంగా ప్రధాన బ్రాండ్ల బీర్లను ఒక్కో షాపునకు 20-25 కేస్ లు ఇస్తుండగా...ఇవి సరిపోవడంలేదని మద్యం షాపుల యజమానులు అంటున్నారు.
బీర్లకు భారీ డిమాండ్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 60 వేల నుంచి 80 వేల కేస్ లకు పైగా బీర్లు (Beers Demand)అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ లో వీటికి అదనంగా మరో 20 వేల కేస్ లు డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం డిమాండ్ కు తదిన స్టాక్ లేకపోవడంతో మద్యం డిపోలు 60 వేల నుంచి 80 వేల కేస్ లను మద్యం షాపులకు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత(Summer Heat) ఎక్కువగా ఉండడంతో...మందుబాబులు బీర్లు లాగించేస్తు్న్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బీర్ల సేల్స్ అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీర్లకు డిమాండ్ పెరుగుతోందని మద్యం షాపుల నిర్వాహకులు అంటున్నారు. బీర్‌ల కంపెనీల నుంచి రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేస్‌ల స్టాక్ వస్తుందని ఎక్సైజ్ శాఖ(Excise Department) వర్గాలు చెబుతున్నాయి. వీటిల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. గత ఏప్రిల్ లో హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 12 లక్షల కేస్‌లకు పైగా బీర్ల సెల్స్(Beer Sales) జరిగితే....ప్రస్తుతం 15 లక్షల కేస్‌లకు పైగా డిమాండ్ వస్తుందని మద్యం వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేస్ ల బీర్లు విక్రయాలు జరుగుతాయని గణాంకాలు చెబుతున్నాయి.
లిక్కర్ సేల్స్
హైదరాబాద్ తో పాటు మెదక్, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో బీర్ల అమ్మకాలు(Beer Sales) భారీగా ఉన్నాయి. మెదక్ రామాయంపేట, నర్సాపూర్‌లోని ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 49 వైన్ షాపులు, ఐదు బార్లు ఉన్నాయి. వీటి ఈ ఏడాది మద్యం అమ్మకాలు(Liquor Sales) భారీగా పెరిగాయి. గత డిసెంబర్ నుంచి మార్చి వరకు రూ.194.68 కోట్ల మద్యం విక్రయాలు జరగగా, ఈసారి రూ.206.71 కోట్ల విక్రయాలు జరిగాయని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండ తీవ్రతను తట్టుకునేందు మందుబాబులు బీర్లు(Beers) ఖాళీ చేస్తున్నారు. మార్చి నెలలో రోజుకు 17,852 కేస్ ల చొప్పున 30 రో జుల్లో సమారు 5,35,589 కేస్ ల బీర్లు ఖాళీచేశారు. బీర్ల సేల్స్ పెరిగినా లిక్కర్ సేల్స్ తగ్గాయని నిర్వాకులు అంటున్నారు. యాదాద్రి జిల్లాలో సైతం లిక్కర్ సేల్స్భారీగా పడిపోయాయి. భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట పరిధిలోని మద్యం షాపుల్లో 10,247 కార్టన్ల లిక్కర్ సేల్స్తగ్గాయని తెలుస్తోంది. కానీ బీర్లకు మాత్రం డిమాండ్ పెరిగింది.
సంబంధిత కథనం