Ram Navami clashes: శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా పలు రాష్ట్రాల్లో అల్లర్లు-vehicles set on fire amid ram navami clashes in maharashtra gujarat and west bengal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ram Navami Clashes: శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా పలు రాష్ట్రాల్లో అల్లర్లు

Ram Navami clashes: శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా పలు రాష్ట్రాల్లో అల్లర్లు

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 07:10 PM IST

Ram Navami clashes: శ్రీరామ నవమి (sri rama navami) ఉత్సవాల సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రల్లో శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి.

పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో ఘర్షణలు జరిగిన ప్రదేశం
పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో ఘర్షణలు జరిగిన ప్రదేశం (Twitter/ANI)

శ్రీరామ నవమి (sri rama navami) ఉత్సవాల సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రల్లో శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి.

yearly horoscope entry point

Maharashtra: మహారాష్ట్రలో..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లో కూడా శ్రీరామ నవమి (sri rama navami) ఉత్సవాల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు రాళ్లు, పెట్రోలు నింపిన సీసాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు సహా 15 మంది గాయపడ్డారు. దాదాపు 500 మంది పరస్పరం రాళ్లతో దాడులు చేసుకోవడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 13 వాహనాలు తగలబడిపోయాయి.

Gujarat : గుజరాత్ లో..

గుజరాత్ (Gujarat) లోని వదోదరలో (vadodara) శ్రీరామనవమి (sri rama navami) శోభాయాత్ర సందర్భంగా రెండు వర్గాలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. శోభాయాత్ర ఊరేగింపు ఒక మసీదు (mosque) కు సమీపంలోకి వచ్చిన సమయంలో ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఇరు వర్గాలు మొదట నినాదాలతో ప్రారంభించి, తరువాత రాళ్లు రువ్వుకున్నారని తెలిపారు.

West bengal : పశ్చిమ బెంగాల్ లో..

పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో శ్రీరామ నవమి (sri rama navami) ఊరేగింపులో గొడవ జరిగింది. రెండు వర్గాల మధ్య ప్రారంభమైన వివాదం తీవ్రమై వాహనాలను తగలబెట్టే వరకు వెళ్లింది. ఆ తరువాత పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Whats_app_banner