HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Lift Accident : హోటల్ 4వ ఫ్లోర్ నుంచి కూలిన లిఫ్ట్, 8 మందికి తీవ్ర గాయాలు

Hyderabad Lift Accident : హోటల్ 4వ ఫ్లోర్ నుంచి కూలిన లిఫ్ట్, 8 మందికి తీవ్ర గాయాలు

27 May 2024, 14:54 IST

    • Hyderabad Lift Accident : హైదరాబాద్ లోని ఓ హోటల్ లో లిఫ్ట్ కూలిన ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హోటల్ 4వ ఫ్లోర్ నుంచి కూలిన లిఫ్ట్, 8 మందికి తీవ్ర గాయాలు
హోటల్ 4వ ఫ్లోర్ నుంచి కూలిన లిఫ్ట్, 8 మందికి తీవ్ర గాయాలు

హోటల్ 4వ ఫ్లోర్ నుంచి కూలిన లిఫ్ట్, 8 మందికి తీవ్ర గాయాలు

Hyderabad Lift Accident : హైదరాబాద్ లోని ఓ హోటల్ లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. సాంకేతిక సమస్యతో 4 అంతస్తు నుంచి పార్కింగ్ ప్లేస్ కు లిఫ్ట్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యి. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కినార గ్రాండ్ హోటల్‌లో మాల్యాద్రి అనే వ్యాపారి తన కుమార్తె నిశ్ఛితార్థం పెట్టుకున్నారు. ఈ కార్యక్రానికి పాల్గొనేందుకు బంధువులు హోటల్ కు చేరుకున్నారు. అయితే 8 మంది అతిథులు 4వ ఫ్లోర్ నుంచి లిఫ్ట్‌‌లో కిందకు వెళ్తుండగా సాంకేతిక లోపంతో లిఫ్ట్ ఒక్కసారిగా సెల్లార్ వరకు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

TGSRTC Conductor Arrest : ఆర్టీసీ బస్సులో యువతితో అసభ్య ప్రవర్తన, కండక్టర్ అరెస్ట్

IRCTC Shirdi Tour : ఈ నెలలో 'షిర్డీ' ట్రిప్ ప్లాన్ ఉందా...? బడ్జెట్ ధరలో 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే...!

CM Revanth Reddy : మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

TG DOST 2024 Updates : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - రేపటితో ముగియనున్న'దోస్త్‌' రిపోర్టింగ్ గడువు..!

ఎంగేజ్మెంట్ వేడుకలో అనుకోని ఘటన

ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు హైదరాబాద్‌లోని అల్కాపురి ఎక్స్‌ రోడ్స్‌లో సమీపంలో కినారా గ్రాండ్ హోటల్ లో లిఫ్ట్ కూలిన సంఘటన చోటుచేసుకుంది. హోటల్ లోని లిఫ్ట్ 4వ అంతస్తు నుంచి పార్కింగ్ ప్రాంతానికి కూలిపోయిందిం. ఈ ఘటనపై ఎనిమిది మంది వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో వీరబ్రహ్మమ్మ, రవిశంకర్ రెడ్డి, మణికంఠ గుప్తా, మనోహర్, షాజీద్ బాబా, కల్యాణ్ కుమార్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హోటల్‌లో జరిగిన ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలిపోవడంతో బాధితులు పెద్దగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే వారిని ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై నాగోల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. లిఫ్ట్ నిర్వహణపై నిర్లక్ష్యం కారణంగా కినారా గ్రాండ్ హోటల్‌పై కేసు చేసినట్లు పోలీసులు తెలిపారు.

షాపింగ్ మాల్ లో లిఫ్ట్ ప్రమాదం

ఇటీవల సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని షాపింగ్​ మాల్​లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ కూలిన ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. లిఫ్ట్ వైర్లు​ తెగిపడటానికి కారణం ఓవర్​లోడ్​ అని షాపింగ్ మాల్ నిర్వాహకులు అంటున్నారు. సదాశివపేటలోని ఓ ఫ్యాషన్​ షాపింగ్​ మాల్ లిఫ్ట్​లో 16 మంది ఎక్కారు. దీంతో ఒక్కసారిగా లిఫ్ట్​కిందకి పోడిపోయింది. ఓవర్​లోడ్​ కావడంతో లిఫ్ట్ కేబుల్ తెగిపోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. లిఫ్ట్ ఒక్కసారిగా కిందకిపడడంతో అందులో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ఓవర్​ లోడ్​కారణంగానే లిఫ్ట్​కేబుల్ తెగిపోయిందని షాపింగ్ మాల్​ నిర్వాహకులు తెలిపారు.

హోటళ్లు, షాపింగ్ మాల్స్ తో పాటు రద్దీ ఎక్కువగా ఉంటే ప్రదేశాల్లో లిఫ్ట్ ల నిర్వహణపై నిర్వాహకులు శ్రద్ధ చూపాలని ప్రజలు కోరుతున్నారు. లిఫ్ట్ నిర్వహణ నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక హైదరాబాద్ లో హోటళ్ల పేరు చెబితే జనం హడలిపోతున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు సైతం నిల్వ ఉంచిన పదార్థాలు, కాలం చెల్లిన వాటితో ఆహారాలు తయారు చేస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో హోటళ్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. తాజాగా లిఫ్ట్ ప్రమాదంతో హోటళ్ల నిర్వాహకులు నిర్లక్ష్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

తదుపరి వ్యాసం