Virat Kohli Restaurant : హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ - గ్లోబల్ మెనూతో పాటు లోకల్ రుచులు-crickter virat kohlis one8 commune restaurant open in hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Virat Kohli Restaurant : హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ - గ్లోబల్ మెనూతో పాటు లోకల్ రుచులు

Virat Kohli Restaurant : హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ - గ్లోబల్ మెనూతో పాటు లోకల్ రుచులు

HT Telugu Desk HT Telugu
May 24, 2024 03:23 PM IST

Virat Kohli Restaurant in Hyderabad: విరాట్ కోహ్లీ రెస్టారెంట్ హైదరాబాద్ నగరానికి కూడా వచ్చేసింది. శుక్రవారం నుంచి ఈ రెస్టారెంట్ అందుబాటులోకి రానున్నట్లు కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

హైదరాబాద్ లో కోహ్లీ రెస్టారెంట్‌
హైదరాబాద్ లో కోహ్లీ రెస్టారెంట్‌

Virat Kohli One8 Commune restaurant in Hyderabad: భారత్ స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పాడు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో తన రెస్టారెంట్ బ్రాంచ్ ఓపెన్ చేశాడు.

విరాట్ కోహ్లి వన్8 కమ్యూన్ పేరుతో ఇప్పటికే బెంగళూర్,ముంబై,పూణె, కోల్ కత్తా నగరాల్లో ఈ రెస్టారెంట్ లను నడుపుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అయన.. హైదరాబాద్ లో కూడా వన్ 8 కమ్యూన్ బ్రాంచ్ ఓపెన్ చేశాడు.

ఎక్కడంటే…?

హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని ఆర్ఎంజెడ్ థీ లాఫ్ట్ లో ఈ రెస్టారెంట్ ను కోహ్లీ శుక్రవారం ప్రారంభించనున్నారు.ఇదే విషయాన్ని విరాట్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశాడు. " మేము ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీకి వచ్చేశాం.నాకు వన్ 8 కమ్యూన్ అంటే అది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు. అది హైదరాబాద్ ప్రజలందర్నీ ఒకే చోట చేర్చి వారికి నచ్చిన ఆహారం అందించడం మా ఉద్దేశం " అని విరాట్ కోహ్లి పేర్కొన్నారు.

ఈ రెస్టారెంట్ నేడు ప్రారంభం కానుండడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో రెస్టారెంట్ కు తరలిరానున్నారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

ఈ హోటల్స్ లో తింటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న హోటల్స్,రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారు.పలు హోటల్స్,రెస్టారెంట్లలో కలుషిత ఆహారం,కుళ్లిపోయిన పదార్థాలతో పాటు ప్రమాదకరమైన రసాయనాలను గుర్తించారు.

శుభ్రత లేకుండా ఫుడ్ తయారీ వంటి వాటిని ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. పలు హోటల్స్ లో ఫుడ్ షైనింగ్ కోసం ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారని అధికారులు గుర్తించారు.

ఈ హోటళ్లలో సోదాలు - బయటపడిన డొల్లతనం

• రామేశ్వరం కేఫ్, మాదాపూర్

• లాబొనెల్ ఫైన్ బేకింగ్, బంజారా హిల్స్

• బాస్కిన్ రాబిన్స్, బంజారా హిల్స్

• కృతుంగ - పాలెగార్స్ వంటకాలు, సోమాజిగూడ

• మాస్టర్ చెఫ్ రెస్టారెంట్, ఉప్పల్

• బాహుబలి కిచెన్, మాదాపూర్

• కృతుంగ - పాలెగార్స్ వంటకాలు, సోమాజిగూడ

• హెడ్ క్వార్టర్స్ రెస్ట్-ఓ-బార్, సోమాజిగూడ

•మాస్టర్ చెఫ్ రెస్టారెంట్, ఉప్పల్

• హోటల్ సాయి బృందావన్ ప్యూర్ వెజ్, ఉప్పల్

• హెడ్ క్వార్టర్స్ రెస్ట్-ఓ-బార్, సోమాజిగూడ.

• మాస్టర్ చెఫ్ రెస్టారెంట్, ఉప్పల్

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

సంబంధిత కథనం

టాపిక్