Virat Kohli RCB : గుజరాత్​లో విరాట్​ కోహ్లీ భద్రతకు ముప్పు.. నలుగురు అరెస్ట్​-threat to kohlis security following 4 arrests rcb cancel practice press meet ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli Rcb : గుజరాత్​లో విరాట్​ కోహ్లీ భద్రతకు ముప్పు.. నలుగురు అరెస్ట్​

Virat Kohli RCB : గుజరాత్​లో విరాట్​ కోహ్లీ భద్రతకు ముప్పు.. నలుగురు అరెస్ట్​

Sharath Chitturi HT Telugu
May 22, 2024 02:25 PM IST

RR vs RCB, IPL 2024: ఐపీఎల్​ 2024 ఎలిమినేటర్​కి ముందు జరగాల్సిన ఏకైన ప్రాక్టీస్​ సెషన్​ని ఆర్సీబీ రద్దు చేసుకుంది. విరాట్​ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉండటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.

విరాట్​ కోహ్లీ భద్రతకు ముప్పు..!
విరాట్​ కోహ్లీ భద్రతకు ముప్పు..! (PTI)

RCB vs RR eleminator : గుజరాత్​ అహ్మదాబాద్​లో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్​ రాయల్స్​తో జరగనున్న ఐపీఎల్​ 2024 ఎలిమినేటర్​ మ్యాచ్​కి ముందు ఉన్న ఏకైక ప్రాక్టీస్​ సెషన్​తో పాటు మీడియా సమావేశాన్ని రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరూ ఆర్సీబీ రద్దు చేసుకుంది. జట్టు స్టార్​ ప్లేయర్​ విరాట్​ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతోనే.. ఆర్సీబీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఇదే విషయంపై పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

మంగళవారం.. కోల్​కతా నైట్​ రైడర్స్​ వర్సెస్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్ల మధ్య ఐపీఎల్​ 2024 క్వాలిఫయర్స్​ జరిగింది. ఇదే వేదికలో బుధవారం ఆర్​ఆర్​- ఆర్సీబీలు తలపడనున్నాయి. అయితే.. కేకేఆర్​- ఎస్​ఆర్​హెచ్​ మ్యాచ్​ కారణంగా.. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆర్​ఆర్​, ఆర్సీబీ జట్లు ప్రాక్టీస్​ చేయలేకపోయాయి. ఇరు జట్ల ప్రాక్టీస్​ కోసం.. గుజరాత్​ కాలేజ్​ గ్రౌండ్స్​ని కేటాయించారు. కానీ ఆర్సీబీ ప్రాక్టీస్​ చేయలేదు. రాజస్థాన్​ రాయల్స్​ జట్టు ప్రాక్టీస్​ చేసుకుంది. సాయంత్రం జరగాల్సిన మీడియా సమావేశాన్ని ఇరు జట్లు నిర్వహించలేదు. ఇది చాలా అరుదైన విషయం.

ఆనందబజార్​ పత్రిక ప్రకారం.. ఆర్సీబీ ప్రాక్టీస్​ చేయకపోవడానికి కారణం.. ఆ జట్టు స్టార్​ ప్లేయర్​ విరాట్​ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉండటం. ఇందుకు సంబంధించి.. సోమవారం రాత్రి అహ్మదాబాద్​ విమానాశ్రయంలో పోలీసులు నలుగురిని అరెస్ట్​ చేశారు. ఈ నలుగురు.. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానాలు ఇందుకు కారణం. ఈ నలుగురికి సంబంధించిన హైడౌట్స్​ని రైడ్​ చేసిన అనంతరం.. ఆయుదాలు, అనుమానాస్పద వీడియో- మెసేజ్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Virat Kohli security issue : ఇదే విషయాన్ని ఆర్​ఆర్​- ఆర్సీబీ జట్లకు మంగళవారం వెల్లడించారు పోలీసులు. ఆర్​ఆర్​ స్పందించలేదు. ఆర్సీబీ మాత్రం.. ప్రాక్టీస్​ సెషన్​ని రద్దు చేసుకుంటున్నట్టు భద్రతా సిబ్బందికి చెప్పింది.

ఐపీఎల్ 2024​ ఎలిమినేటర్​ వంటి భారీ ఈవెంట్​కి ముందు ప్రాక్టీస్​ సెషన్స్​ రద్దు చేసుకోవడం చాలా అరుదైన విషయం. బలమైన కారణాలు ఉంటేనే ఇలా జరుగుతుంది.

ఈ వ్యవహారంపై పోలీసు అధికారి విజయ్​ సింఘ జ్వలా మాట్లాడుతు.. "నలుగురు అరెస్ట్​ అయ్యారన్న విషయం.. అహ్మదాబాద్​కు వచ్చిన తర్వాత కోహ్లీ తెలుసుకున్నాడు. విరాట్​ కోహ్లీ జాతీయ సంపద! అతని సెక్యూరిటీకి కీలక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్సీబీకి రిస్క్​ తీసుకోవాలనిపించలేదు. ప్రాక్టీస్​ చేయడం లేదని మాకు చెప్పారు. రాజస్థాన్​ రాయల్స్​కి కూడా చెప్పాము. కానీ ప్రాక్టీస్​ చేసుకోవడానికి వారికి ఇబ్బందులు కనిపంచలేదు," అని అన్నారు.

టీమ్​ హోటల్​ వద్ద కట్టుదిట్టమైన భద్రత..

Virat Kohli latest news : మరోవైపు.. అహ్మదాబాద్​లో ఆర్సీబీ టీమ్​ బస చేస్తున్న హోటల్​ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఆర్సీబీ సభ్యులకు ప్రత్యేక ఎంట్రీని ఏర్పాటు చేశారు. ఇతరులు అందులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐపీఎల్​కు సంబంధించిన మీడియా సిబ్బందిని కూడా హోటల్​ లోపలికి అనుమతించలేదు.

"ఆర్​ఆర్​ టీమ్​ని మూడూ పోలీస్​ కాన్వాయ్​లు ఎస్కార్ట్​ చేశాయి. సంజూ సామ్​సన్​ ఆలస్యంగా వెల్లాడు. అశ్విన్​, రియాన్​ పరాగ్​, చాహల్​లు హోటల్​లోనే ఉండిపోయారు. భారీ భద్రత మధ్య మిగిలిన ఆర్​ఆర్​ సభ్యులు ప్రాక్టీస్​ చేశారు. పోలీసులు గ్రౌండ్​ మొత్తం పాట్రోలింగ్​ చేశారు," అని సదరు వార్తా సంస్థ తెలిపింది.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం