Hyderabad Realtor Murder : హైదరాబాద్ రియాల్టర్ బీదర్ లో దారుణ హత్య
Hyderabad Realtor Murder : హైదరాబాద్ కు చెందిన రియాల్టర్ కర్ణాటకలోని బీదర్ లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 24న చింతల్ కిడ్నాప్ నకు గురైన రియాల్టర్ మృతదేహం బీదర్ లో లభ్యమైది.
Hyderabad Realtor Murder : హైదరాబాద్ లోని జీడిమెట్ల ప్రాంతానికి చెందిన కుప్పం మధు ఈనెల 24 న చింతల్ లో అదృశ్యం అయ్యాడు. కుప్పం మధు హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మధును మే 24న మధ్యాహ్నం చింతల్ ప్రాంతంలో కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలోనే మధు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.....మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే ఇవాళ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతంలో రియాల్టర్ కుప్పం మధు మృతదేహం లభ్యం అయ్యింది. దుండగులు మధు తలపై బండ రాయితో కొట్టి, కత్తులతో పొడిచి హత్య చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. కుప్పం మధును చింతల్ లో కిడ్నాప్ చేసిన వారే బీదర్ లో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మృతుడు కుప్పం మధు అదృశ్యం అయిన రోజు తన వెంట ఉన్న రూ.5 లక్షలు, ఒంటి మీద బంగారాన్ని దుండగులు తీసుకుని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈదురు గాలులకు చెట్టు కూలి ఇద్దరు మృతి
ఈదురు గాలులకు చెట్టు కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... భువనగిరి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి, మరో వ్యక్తి ధనుంజయ్ బైక్ వస్తుండగా వారిపై చెట్టు కూలిపోయింది. దీంతో రాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.....ధనుంజయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
హఫీజ్ పేట్ లో గోడ కూలి ఇద్దరు మృతి
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి పరిధి హఫీజ్ పేట్ లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షానికి పాత గోడ కూలి ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ పేట్ సాయి నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి నగర్ కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న సమాధ్ (3) మీద ఈదురు గాలులకు, వర్షానికి గోడ శిథిలాలు ఒక్కసారిగా కులాయి. దీంతో వెంటనే అతన్ని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగా బాబు మరణించాడు. ఇక అదే ప్రాంతంలో రసిద్ (45) అనే వ్యక్తి రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా పాత గోడ ఇటుకలు మీద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలపై మియాపూర్ పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మధుకు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా