తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hmda Clay Ganesh: లక్ష మట్టి వినాయక విగ్రహాలు - ఈ ప్రాంతాల్లో ఫ్రీగా పంపిణీ

HMDA Clay Ganesh: లక్ష మట్టి వినాయక విగ్రహాలు - ఈ ప్రాంతాల్లో ఫ్రీగా పంపిణీ

26 August 2022, 19:35 IST

google News
    • Distribution of Clay Ganesh Idols in Hyderabad :వినాయ‌ చ‌వితిని పుర‌స్క‌రించుకొని హెచ్ఎండీఏ ఆధ్వ‌ర్యంలో ఉచితంగా ల‌క్ష మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ఈనెల 27 నుంచి 30 వ తేదీల్లో పలు ప్రాంతాల్లో అందజేస్తారు.
మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

Distribution of Clay Ganesh Idols by HMDA:ఈనెల 31వ తేదీన వినాయక చవితి నేపథ్యంలో హెచ్ఎండీఏ ఉచిత మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. శనివారం(27వ తేదీ) నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హెచ్ఎండీఏ మెట్రోపాలిట‌న్ క‌మిష‌న‌ర్, ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ ప్రకటించారు.

ఈ ప్రాంతాల్లోనే...

Clay Ganesh Idols in Hyderabad 2022: ఈ నెల 29, 30 తేదీల్లో మాదాపూర్ మైండ్ స్పేస్, పెద్ద అంబర్‌పేట్ నగర పంచాయతీ ఆఫీస్, కోటక్ మహీంద్రా బ్యాంకు, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, హెచ్‌జీసీఎల్ ఆఫీస్‌ల వద్ద మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తారు.

ఈ నెల 29, 30 తేదీల్లో మొబైల్ వెహికల్స్ ద్వారా మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్, మై హోం జూవెల్ పైప్ లైన్ రోడ్, ఇతర గేటెడ్ కమ్యూనిటీస్, ఇందు ఫార్ట్చున్ పరిసర ప్రాంతాలు, కూకట్‌ప‌ల్లి, కేపీహెచ్‌బీ, మలేషియన్ టౌన్ షిప్‌లలో పంపిణీ చేస్తారు.

మరో 5 ప్రాంతాల్లో రెసిడెన్సీయల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు.

విగ్రహాలు పంపిణికి, పర్యవేక్షణకు ప్రాంతాలు వారిగా ఇంచార్జి అధికారులను నియమించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అరవింద్ కుమార్... పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2017 నుంచి మట్టి వినాయక విగ్రహాలను హెచ్ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు. ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 2017లో 30 వేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తే, 2022లో ఒక లక్ష మట్టి వినాయక విగ్రహాలను హెచ్ఎండీఏ ఉచితంగా పంపిణీ చేస్తున్నద‌ని వెల్లడించారు. ఫలితంగా పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

తదుపరి వ్యాసం