HMDA Plots For Sale: నగర శివారులో హెచ్ఎండీఏ ఫ్లాట్ల వేలం.. పూర్తి వివరాలివే-telangana govt auctions 34 hmda prime plots at turkyamjal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Govt Auctions 34 Hmda Prime Plots At Turkyamjal

HMDA Plots For Sale: నగర శివారులో హెచ్ఎండీఏ ఫ్లాట్ల వేలం.. పూర్తి వివరాలివే

HT Telugu Desk HT Telugu
May 29, 2022 02:49 PM IST

హైదరాబాద్ నగర శివారులోని తుర్కయాంజల్‌లో ఉన్న ప్రభుత్వ ప్లాట్లను విక్రయించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ట్విటర్​ ద్వారా వెల్లడించారు.

తుర్కయాంజల్‌ ప్రభుత్వ ప్లాట్ల విక్రయానికి ప్రకటన
తుర్కయాంజల్‌ ప్రభుత్వ ప్లాట్ల విక్రయానికి ప్రకటన

ఆదాయ సమీకరణలో భాగంగా భూముల అమ్మకంపై దృష్టిపెట్టింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే పలు జిల్లాలోనూ హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ఫ్లాట్ల వేలానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. తాజాగా తుర్కయాంజల్​లో ఓఆర్​ఆర్ లోపలవైపు ఉన్న ప్రభుత్వ ప్లాట్లు అమ్మనున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ట్విటర్​లో పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని ప్లాటన్లు ఈ వేలం పద్ధతిలో విక్రయించనున్నట్టు తెలిపారు. ఇక్కడ మొత్తం 34 ప్లాట్లకు ఈ వేలం జరగనున్నట్టు వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను ట్వీట్ కు జత చేశారు.

ట్రెండింగ్ వార్తలు

600 నుంచి 700 గజాలు -14 ప్లాట్లు

701 నుంచి 800 గజాలు- 10

800 నుంచి 850 గజాలు- 5

900 నుంచి 1060 గజాలు- 5 ప్లాట్లు

ఈ నెల 31 నుంచి జూన్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రీ బిడ్డింగ్​ మీటింగ్ జూన్ 4, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. జూన్ 30వ తేదీన ఈ-వేలం ప్రక్రియ సాగనుంది. రిజిస్ట్రేషన్ కోసం 1000 రూపాయలను ఆన్​లైన్​లో చెల్లించాలని ప్రకటనలో స్పష్టం చేశారు. వివరాల కోసం 7601046438/ 76010633358 నంబర్లను సంప్రదించవచ్చు

<p>ఫ్లాట్ల వేలానికి సంబంధించిన ప్రకటన</p>
ఫ్లాట్ల వేలానికి సంబంధించిన ప్రకటన

కొద్దిరోజుల కిందట హెచ్ఎండీ, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్లు, ఖాళీ స్థలాల కొనే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించింది.కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ స్థలాలు ఉన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం వద్ద 253 ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. గజానికి రూ. 7000 ధరగా నిర్ణయించారు. ఇక ఇక్కడే 363 ఇళ్లు నిర్మించారు. చ.అ.ధర రూ. 7 వేల నుంచి రూ. 12వేలుగా నిర్ధారించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాల కోసం nalgonda.telangana.gov.in వెబ్ సైట్ ను చూడవచ్చు. 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని నుస్తులాపూర్ వద్ద 237 ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. నివాస స్థలానికి కేటాయించిన వాటిలో గజం ధర రూ. 6000గా ఉండగా కమర్షియల్ స్థలంలో రూ. 8000గా నిర్ణయించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాల కోసం karimnagar.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా బూత్ పూర్, అమిస్తాపూర్ ప్రాంతాల్లో 348 ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ గజం ధర. 8000గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం mahabubnagar.telangana.gov.in వెబ్ సైట్ ను చూడవచ్చు.

IPL_Entry_Point