Hyderabad Rains : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ రాత్రికి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
23 September 2024, 18:24 IST
- Hyderabad Rains : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదే సమయంలో.. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు
హైదరాబాద్ నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా సోమవారం రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. మియాపూర్, నిజాంపేట్, లింగంపల్లి, టోలీచౌకి, షేక్‌పేట్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, రాజేంద్రనగర్ ఏరియాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు.
అటు తెలంగాణలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్గొండ, నారాయణపేట, గద్వాల్, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి, రంగారెడ్డిలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. సోమవారం రాత్రి పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఐఎండీ హైదరాబాద్ ప్రకారం.. 24వ తేదీ.. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్‌పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
25వ తేదీన.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే సమయంలో.. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
26వ తేదీన.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.