Telangana Tourism : గోవా టూర్ వెళ్లాలనుకుంటున్నారా.. తెలంగాణ టూరిజం అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది!
- Telangana Tourism : చాలామంది గోవా వెళ్లాలనుకుంటారు. కానీ.. సరైన గెడెన్స్ లేక ఆగిపోతుంటారు. ఎలా వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలి.. గోవా వెళ్లాక ఎక్కడ ఉండాలి అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి. అలాంటి వారి కోసమే.. తెలంగాణ టూరిజం బెస్ట్ ఆఫర్ ఇస్తోంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వీలు కల్పిస్తోంది.
- Telangana Tourism : చాలామంది గోవా వెళ్లాలనుకుంటారు. కానీ.. సరైన గెడెన్స్ లేక ఆగిపోతుంటారు. ఎలా వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలి.. గోవా వెళ్లాక ఎక్కడ ఉండాలి అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి. అలాంటి వారి కోసమే.. తెలంగాణ టూరిజం బెస్ట్ ఆఫర్ ఇస్తోంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వీలు కల్పిస్తోంది.
(1 / 5)
హైదరాబాద్ నుంచి గోవా టూర్‌కు తెలంగాణ టూరిజం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. మొత్తం 4 రోజులు ఈ టూర్ ఉండనుంది. ప్రతీ సోమవారం హైదరాబాద్ నుంచి గోవాకు టూర్ స్టార్ట్ అవుతుంది. ప్రతీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బషీర్‌బాగ్ నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి పూట ప్రయాణం ఉంటుంది. మార్గ మధ్యలో డిన్నర్ కోసం బ్రేక్ ఇస్తారు.(Telangana Tourism)
(2 / 5)
రెండో రోజు ఉదయం 6 గంటల వరకు గోవా చేరుకుంటారు. హోటల్ బెవ్వన్ రిసార్ట్ (కలంగుట్) స్టేయింగ్ ఉంటుంది. ఉదయం 10.00 గంటల నుండి నార్త్ గోవా సైట్ సీయింగ్ ఏర్పాటు చేస్తారు. మపుసా సిటీ, లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్, కలంగుట్ బీచ్, వాగేటర్ బీచ్‌ను చూడొచ్చు.(@IndianTechGuide)
(3 / 5)
మూడో రోజు సౌత్ గోవా సైట్ సీయింగ్ ఉంటుంది. డోనా పౌలా బీచ్, మిరామార్ (గ్యాస్పర్ డయాస్ బీచ్), పాత గోవా చర్చిలు, మంగూషి దేవాలయాలు, కొల్వా బీచ్, మార్డోల్ బీచ్ మొదలైనవి మూడో రోజు చూడొచ్చు.(@Airbnb_in)
(4 / 5)
అదే రోజు సాయంత్రం.. ఒక గంట బోట్ క్రూయిజ్ అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అక్కడ సొంత ఖర్చుతో ఎంజాయ్ చేయొచ్చు. హోటల్ బెవ్వన్ రిసార్ట్ (కలంగుటే)లో రాత్రి స్టేయింగ్ ఉంటుంది. (@IndianDiplomacy)
(5 / 5)
నాలుగో రోజు హోటల్ బెవ్వన్ రిసార్ట్ (కలంగుట్) నుండి ఉదయం 11.00 గంటలకు బస్సు బయలుదేరుతుంది. 5వ రోజు ఉదయం 6.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. పెద్దలకు రూ. 11999, పిల్లలకు రూ.9599 ఛార్జ్ వసూలు చేస్తారు. ఏపీ వసతితో పాటు.. ఏసీ వోల్వో కోచ్‌లో ప్రయాణం ఉంటుంది. బుకింగ్స్ కోసం 9848540371 నంబర్‌లో సంప్రదించవచ్చు.(@Gomantak_Times)
ఇతర గ్యాలరీలు