తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jatara Prasadam 2024 : మేడారం వెళ్లలేని భక్తులకు గుడ్‌న్యూస్ - మీ ఇంటికే ప్రసాదం, బుకింగ్ ఇలా చేసుకోవచ్చు

Medaram Jatara Prasadam 2024 : మేడారం వెళ్లలేని భక్తులకు గుడ్‌న్యూస్ - మీ ఇంటికే ప్రసాదం, బుకింగ్ ఇలా చేసుకోవచ్చు

14 February 2024, 9:31 IST

google News
    • Medaram Sammakka Sarakka Jatara 2024 Updates: మేడారం వెళ్లలేని భక్తుల కోసం శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. మీ ఇంటికే తల్లుల ప్రసాదాన్ని చేర్చే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బుకింగ్ ప్రాసెస్ వివరాలను పేర్కొంది. 
మేడారం జాతర
మేడారం జాతర

మేడారం జాతర

Medaram Jatara Prasadam 2024: తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి టీఎస్ఆర్టీసీ(TSRTC) శ్రీకారం చుట్టింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ(Medaram Sammakka Sarakka Jatara 2024) అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది.

బుకింగ్ ప్రాసెస్ ఇదే…

Medaram Jatara Prasadam Booking 2024: మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు జరుగుతుండగా.. ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు ఆన్‌లైన్‌/ఆఫ్ లైన్ లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ(Medaram Jatara Prasadam) కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. https://rb.gy/q5rj68 లింక్‌ పై క్లిక్‌ చేసిగానీ లేదా పేటీఎం ఇన్‌ సైడర్‌ యాప్‌ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని(Medaram Jatara Prasadam) ఆర్డర్ ఇవ్వొచ్చు.

"రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచనల మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ(Medaram Sammakka Sarakka Jatara 2024) అమ్మవార్లను దర్శించుకోలేని భక్తులకు ప్రసాదం(బంగారం) అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. బుకింగ్‌ చేసుకునే భక్తులకు ప్రసాదంతో పాటు అమ్మవార్ల పసుపు, కుంకుమను అందజేస్తాం. ఈ బుకింగ్‌ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుక్‌ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుంది." అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు.

రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లలో ఈ సేవ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ ఏజెంట్స్ తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించి ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని తెలిపారు. లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు ఆన్ లైన్ లో పేటీఎం ఇన్ సైడర్ పోర్టల్ లో గానీ యాప్ లోనూ సులువుగా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ బుకింగ్‌ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్‌ కోడ్‌, ఫోన్‌ నంబర్‌ ను తప్పనిసరిగా నమోదుచేయాలన్నారు. మేడారం ప్రసాద బుకింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440069, 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఆయన సూచించారు.

ప్రత్యేక బస్సులు….

Medaram bus fares 2024: భక్తులను మేడారం చేర్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించగా.. గత జాతరలతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మీ స్కీం ఇంప్లిమెంట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేట్ చేసే ఆరు వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 40 లక్షల మంది వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రాకపోకలు సాగించే భక్తులకుTSRTC ఆర్టీసీ ఛార్జీలు కూడా డిసైడ్ చేశారు.

1.హనుమకొండ నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు ఉండగా.. పెద్దలకు ఛార్జీ 250, చిన్నారులకు 140 గా బస్ ఛార్జీ నిర్ణయించారు.

2. కాజీపేట నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140

3. వరంగల్ నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140

4. జనగామ నుంచి మేడారం జాతర 165 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 370, చిన్నారుల ఛార్జీ: 210

5. హైదరాబాద్ నుంచి మేడారం 259 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 550, చిన్నారుల ఛార్జీ: 310

6. హైదరాబాద్ పరిధిలోని మిగతా ప్రాంతాల నుంచి మేడారం 274 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 600, చిన్నారుల ఛార్జీ: 320

7. స్టేషన్ ఘన్ పూర్ నుంచి మేడారం జాతర 140 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 180

8. నర్సంపేట నుంచి మేడారం జాతర 107 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250 , చిన్నారుల ఛార్జీ: 150

9. కొత్తగూడ నుంచి మేడారం జాతర 137 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 170

10. పరకాల నుంచి మేడారం జాతర 107 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140

11. చిట్యాల నుంచి మేడారం జాతర 115 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250 , చిన్నారుల ఛార్జీ: 140

12. మహబూబాబాద్ నుంచి మేడారం జాతర 155 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 350 , చిన్నారుల ఛార్జీ: 190

13. గూడూరు నుంచి మేడారం జాతర 125 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 280 , చిన్నారుల ఛార్జీ: 160

14. తొర్రూరు నుంచి మేడారం జాతర 165 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 350 , చిన్నారుల ఛార్జీ: 190

15. వర్ధన్నపేట నుంచి మేడారం జాతర 133 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 160

16. ఆత్మకూరు నుంచి మేడారం జాతర 90 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 210 , చిన్నారుల ఛార్జీ: 120

17. మల్లంపల్లి నుంచి మేడారం జాతర 75 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 180 , చిన్నారుల ఛార్జీ: 110

18. ములుగు నుంచి మేడారం జాతర 60 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 150, చిన్నారుల ఛార్జీ: 90

19. భూపాలపల్లి నుంచి మేడారం జాతర 100 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 220, చిన్నారుల ఛార్జీ: 130

20. ములుగు గణపురం నుంచి మేడారం జాతర 80 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 200 , చిన్నారుల ఛార్జీ: 110

21. జంగాలపల్లి నుంచి మేడారం జాతర 55 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 150 , చిన్నారుల ఛార్జీ: 90

22. పస్రా నుంచి మేడారం జాతర 30 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 80 , చిన్నారుల ఛార్జీ: 50

23. గోవిందరావుపేట నుంచి మేడారం జాతర 35 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 100 , చిన్నారుల ఛార్జీ: 60

24. తాడ్వాయి నుంచి మేడారం జాతర 16 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 60 , చిన్నారుల ఛార్జీ: 40

తదుపరి వ్యాసం