తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dy Cm Bhatti :దసరాలోపే ఫీజు రీయంబర్స్‌మెంట్,స్కాలర్ షిప్ బకాయిలు విడుదల-త్వరలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్: భట్టి విక్కమార్క

Dy CM Bhatti :దసరాలోపే ఫీజు రీయంబర్స్‌మెంట్,స్కాలర్ షిప్ బకాయిలు విడుదల-త్వరలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్: భట్టి విక్కమార్క

08 October 2024, 19:19 IST

google News
    • Dy CM Bhatti Vikramarka : విద్యుత్ శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే దసరా కంటే ముందు ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌, పెండింగ్‌ బకాయిలు విడుదల చేస్తామని తెలిపారు.
దసరాలోపే ఫీజు రీయంబర్స్‌మెంట్,స్కాలర్ షిప్ బకాయిలు విడుదల-త్వరలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్: భట్టి విక్కమార్క
దసరాలోపే ఫీజు రీయంబర్స్‌మెంట్,స్కాలర్ షిప్ బకాయిలు విడుదల-త్వరలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్: భట్టి విక్కమార్క

దసరాలోపే ఫీజు రీయంబర్స్‌మెంట్,స్కాలర్ షిప్ బకాయిలు విడుదల-త్వరలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్: భట్టి విక్కమార్క

తెలంగాణ నిరుద్యోగులకు త్వరలో మరో గుడ్ న్యూస్ అందనుంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.విద్యాశాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం ఖమ్మం, వరంగల్ విద్యుత్ శాఖ అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పదేళ్లుగా నిలిచిన పదోన్నతులను పూర్తి చేశామన్నారు.

రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా చూస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు సోలార్ సిస్టమ్ కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1912 నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ సిబ్బంది, అధికారుల పాత్ర చాలా కీలకమని స్పష్టం చేశారు. వ్యవసాయ పంపు సెట్లను నెల రోజుల్లోనే అందిస్తామని ప్రకటించారు.

దసరాలోపే పెండింగ్ బకాయిలు విడుదల

విద్యుత్ సిబ్బంది, అధికారులు పొలం బాట పట్టాలని, ఎక్కడా విద్యుత్ సమస్య లేకుండా డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇటీవల వరదలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకొనేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. వరదల సమయంలో విద్యుత్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారని, వారందరికీ అభినందనలు తెలిపారు. దసరా కంటే ముందు ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ బకాయిలు, పెండింగ్‌ బకాయిలు విడుదల చేస్తామని భట్టి విక్రమార్త తెలిపారు.

విద్యుత్ శాఖకు స్టాఫ్ కాలేజీ

విద్యుత్ శాఖకు కూడా స్టాఫ్ కాలేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ రంగంలో వస్తున్న సంస్కరణలు, మార్పులను ఈ కాలేజీలో నేర్పించాలన్నారు. పొలాల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఎక్కడ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. పదేళ్లలో పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ లు ఇచ్చామన్నారు. విద్యుత్ శాఖలోని ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తామన్నారు.

డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 9న నియామక పత్రాలు అందజేత

తెలంగాణలో 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 9న నియామక పత్రాలు ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలను ఇవ్వనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఇటీవల సీఎస్‌ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

టీచర్ పోస్టుల భర్తీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మొత్తం 25,924 మందికి అవకాశం కల్పించారు. కానీ.. 24,466 మంది హాజరయ్యారు. 1,458 మంది రాలేదు. టీచర్‌ పోస్టులకు పోటీపడిన వారిలో అధిక శాతం మంది మహిళలే ఉన్నారు.పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితిని నివారించేందుకు మొదట ఎస్‌ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్‌జీటీకి ఎంపికైన వారికి సంబంధించిన జాబితా విడుదల చేయనున్నారు. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో దానిలోనూ ఉంటే.. ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్‌లో ఉన్న వారిని చేర్చనున్నారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు.

తదుపరి వ్యాసం