తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha Arrest : లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్ -మార్చి 23 వరకు రిమాండ్

MLC Kavitha Arrest : లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్ -మార్చి 23 వరకు రిమాండ్

16 March 2024, 17:37 IST

google News
    • MLC Kavitha Arrest in Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను కోర్టులో హాజరుపర్చింది ఈడీ. రౌజ్ అవెన్యూ కోర్టు….మార్చి 23 వరకు కోర్టు రిమాండ్ విధించింది. 
కవిత అరెస్ట్
కవిత అరెస్ట్

కవిత అరెస్ట్

MLC Kavitha Arrest in Delhi liquor scam Updates: దిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(Kavitha Arrest) మార్చి 23 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీకి ఇస్తూ దిల్లీ కోర్టు రిమాండ్ (Kavitha Remand)విధించింది. ఈ కేసులో కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్టు చేసింది. ఆమెను దిల్లీకి తరలించి రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ ముందు హాజరపర్చింది. ఈడీ వాదనలు వినిపిస్తూ కవితకు 10 రోజుల రిమాండ్‌ ఇవ్వాలని కోర్టును కోరింది. హైదరాబాద్(Hyderabad) లోని కవిత నివాసంలో ఈడీ, ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాలు అనంతరం ఈడీ కవితను అరెస్టు చేసింది.

కవిత తరఫు న్యాయవాది వాదనలు

జనవరి 3వ తేదీన ఈడీ నుంచి సమన్లు(ED Summons) అందాయని కవిత తరపు న్యాయవాది చెప్పారు. ప్రతి విషయాన్ని హైలైట్ చేస్తూ ఒక లేఖ రాసి బదులిచ్చినట్లు వాదనలు వినిపించారు. కవిత(Mlc Kavitha) వేసిన పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.. కవితకి వచ్చిన రిలీఫ్ ఇంకా అమలులో ఉందని, కోర్టు పరిధిలో ఉండగా మళ్లీ సమన్లు జారీ చేశారన్నారని కవిత తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈడీకి కవిత పూర్తిగా సహకరించారని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. అయినా అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు.

ఈడీ వాదనలు

తన అరెస్టు చట్టవిరుద్ధమని, దీనిపై కోర్టులో పోరాడతానని కవిత అన్నారు. శనివారం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈడీ అధికారులు అధికారాన్ని దుర్వినియోగం పాల్పడ్డారని వాదించారు. సుప్రీంకోర్టు(Supreme Court) కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఈడీ చేసిందని కోర్టుకు తెలిపారు. ఈడీ తరఫున ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హోస్సేన్ వాదిస్తూ... దర్యాప్తు సంస్థ ఎలాంటి బలవంతపు చర్య తీసుకోదన్నారు. సుప్రీంకోర్టు సహా ఏ కోర్టుకు కవిత పిటిషన్ పై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని వాదించారు. కవిత పిటిషన్ (Kavitha Petition)పై విచారణ సందర్భంగా ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. కేసుకు సంబంధించిన ఆధారాలను కవిత ధ్వంసం చేశారని పేర్కొంది. మొదటి సమానుని జారీ చేసిన వెంటనే 5 పరికరాలలో 4 ఫోన్లని ఫార్మాట్ చేశారని తెలిపింది. కఠిన చర్యలు తీసుకోమని తాము ఎలాంటి అండర్ టేకింగ్ సుప్రీంకోర్టుకు ఇవ్వలేదని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి నిర్ణయానికి రావొద్దని అన్నారు.

తదుపరి వ్యాసం