BRS Kavitha Arrest Live News : లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్, మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి-ed arrested brs mlc kavitha in delhi liquor scam case latest live news updates march 16 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ed Arrested Brs Mlc Kavitha In Delhi Liquor Scam Case Latest Live News Updates March 16

కవిత అరెస్ట్

BRS Kavitha Arrest Live News : లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్, మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి

  • BRS MLC Kavitha Arrest Live Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. శుక్రవారం రాత్రే ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఈడీ, కవిత తరపు న్యాయవాదులు వాడీవేడీగా వాదనలు వినిపిస్తున్నారు. లైవ్ అప్డేట్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేయండి……

Sat, 16 Mar 202411:39 AM IST

మార్చి 23 వరకు ఈడీ కస్టడీ

మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను దిల్లీ కోర్టు మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది. అయితే కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది.

Sat, 16 Mar 202409:20 AM IST

ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

కవిత అరెస్ట్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత రిమాండ్‌, కస్టడీ అంశంపై సాయంత్రం 4.30కి ఆర్డర్‌ ఇవ్వనుంది కోర్టు. అప్పటి వరకు తీర్పు రిజర్వ్ చేసింది.

Sat, 16 Mar 202408:08 AM IST

లంచ్ బ్రేక్….

వాదనలకు బ్రేక్ ఇచ్చింది కోర్టు. లంచ్ విరామం తర్వాత తిరిగి వాదనలు కొనసాగనున్నాయి.

Sat, 16 Mar 202407:53 AM IST

వాడీవేడీగా వాదనలు

కవిత కేసులో వాడీవేడీగా వాదనలు కొనసాగుతున్నాయి.

Sat, 16 Mar 202407:29 AM IST

నోటీసులకు బదులిచ్చాం - కవిత తరపు న్యాయవాది

జనవరి 03వ తేదీన ఈడీ నుంచి సమన్లు అందాయని కవిత తరపు న్యాయవాది చెప్పారు. ప్రతి విషయాన్ని హైలైట్ చేస్తూ ఒక లేఖ రాసి బదులిచ్చినట్లు వాదనలు వినిపించారు.

Sat, 16 Mar 202407:27 AM IST

ఆధారాలను ధ్వంసం చేశారు - ఈడీ

కవిత పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈడీ కీలక విషయాలను ప్రస్తావిస్తోంది. కేసుకు సంబంధించిన ఆధారాలను కవిత ధ్వంసం చేశారని పేర్కొంది. మొదటి సమన్‌ని జారీ చేసిన వెంటనే 5 పరికరాలలో 4 ఫోన్లని ఫార్మాట్ చేశారని తెలిపింది.

Sat, 16 Mar 202407:13 AM IST

ఈడీ వాదనలు

కఠిన చర్యలు తీసుకోమని తాము ఎలాంటి అండర్ టేకింగ్ సుప్రీంకోర్టుకు ఇవ్వలేదని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి నిర్ణయానికి రావొద్దని అన్నారు.

Sat, 16 Mar 202406:57 AM IST

ఆ కేసు పెండింగ్ లో ఉండగానే అరెస్ట్….

"కోర్టు పరిధిలో ఉండగా మళ్లీ సమన్లు జారీ చేశారు.. కవిత వేసిన పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.. కవితకి వచ్చిన రిలీఫ్ ఇంకా అమలులో ఉంది" అని కవిత తరపు లాయర్ వాదనలు వినిపించారు.

Sat, 16 Mar 202406:41 AM IST

ఈడీకి సహకరించారు - కవిత తరపు లాయర్

ఈడీకి కవిత పూర్తిగా సహకరించారని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. అయినా అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు.

Sat, 16 Mar 202406:39 AM IST

వాదనలు ప్రారంభం

కవిత కేసులో కోర్టులో ప్రోసిడింగ్స్ ప్రారంభమయ్యాయి.

Sat, 16 Mar 202406:35 AM IST

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నాగర్ కర్నూలులో తలపెట్టిన బీజేపీ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. లిక్కర్ కేసులో అవినీతికి పాల్పడిన చరిత్ర కేసీఆర్ కుటుంబానికి ఉందన్నారు.

Sat, 16 Mar 202406:21 AM IST

10 రోజుల కస్టడీ కోరిన ఈడీ

కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పేర్కొంది.

Sat, 16 Mar 202406:15 AM IST

నాది ఇల్లీగల్‌ అరెస్ట్ - కవిత

తనది ఇల్లీగల్‌ అరెస్ట్.. కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత.

Sat, 16 Mar 202406:14 AM IST

ముందుస్తు అరెస్ట్ లు…

బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలవురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Sat, 16 Mar 202406:01 AM IST

అక్రమ అరెస్ట్ - కవిత కామెంట్స్

కోర్టులోకి వెళ్లేందుకు కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ అక్రమం అని అన్నారు. దీనిపై పోరాడుతామని కామెంట్స్ చేశారు.

Sat, 16 Mar 202405:54 AM IST

కోర్టుకు చేరుకున్న కవిత

రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవితను తరలించిన ఈడీ అధికారులు

Sat, 16 Mar 202405:36 AM IST

కోర్టు ముందుకు కవిత

మరికాసేపట్లో కవితను జస్టిస్ ఎంకే నాగ్ పాల్ బెంచ్ ముందు కవితను హాజరుపర్చనున్నారు.

Sat, 16 Mar 202405:06 AM IST

కవితకు రిమాండ్…?

కవితను కోర్టులో హాజరుపర్చింది ఈడీ. అయితే రిమాండ్ విధించిందా లేదా అనేది కాసేపట్లో క్లారిటీ రానుంది.

Sat, 16 Mar 202404:59 AM IST

కేజ్రీవాల్ కు బెయిల్ - కవితకు…?

కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో…. కవిత పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Sat, 16 Mar 202404:58 AM IST

కవిత బెయిల్ పిటిషన్

రౌజ్ అవెన్యూ కోర్టులోనూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయన్నారు కవిత తరపు న్యాయవాదులు. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠగా మారింది.

Sat, 16 Mar 202404:47 AM IST

బీఆర్ఎస్ నిరసనలు

కవిత అరెస్ట్ ను ఖండిస్తూ ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు.

Sat, 16 Mar 202404:44 AM IST

కేజ్రీవాల్ కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ముందుస్తు బెయిల్ మంజూరైంది.

Sat, 16 Mar 202404:44 AM IST

సుప్రీంకు కవిత

తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత… సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ పిటిషన్ వేసే అవకాశం ఉంది.

Sat, 16 Mar 202404:26 AM IST

కాసేపట్లో కోర్టుకు……

వైద్య పరీక్షలు పూర్తి అయిన నేపథ్యంలో కాసేపట్లో కవితను కోర్టులో హాజరుపర్చనున్నారు.

Sat, 16 Mar 202404:25 AM IST

వైద్య పరీక్షలు పూర్తి

కవితకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్‌ భవన్‌కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం మెడికల్ పరీక్షలను పూర్తి చేశారు.

Sat, 16 Mar 202404:23 AM IST

కవిత పిటిషన్ పై విచారణ వాయిదా

కవిత పిటిషన్ పై మార్చి 15వ తేదీన విచారించిన సుప్రీంకోర్టు…. మార్చి 19వ తేదీకి విచారణ వాయిదా పడింది. ఇదిలా ఉండగానే…. ఈడీ అధికారులు….. కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. మార్చి 16వ తేదీ ఢిల్లీలెని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Sat, 16 Mar 202404:22 AM IST

సుప్రీంలో కవిత పిటిషన్

మరోవైపు గతేడాదే ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీంతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు… తుది ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కొద్ది నెలలుగా వాదనలు కొనసాగుతున్నాయి.

Sat, 16 Mar 202404:22 AM IST

అప్రూవర్లుగా నిందితులు

ఇదిలా ఉండగానే ఈ కేసులోని నిందితులుగా ఉన్న పలువురు అప్రూవర్లుగా మారారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది. దీని ఆధారంగా దూకుడు పెంచే పనిలో పడ్డాయి సీబీఐ, ఈడీ. ఈ సమాచారం ఆధారంగానే కవితకు ఇటీవలే కూడా నోటీసులు పంపాయి. అంతేకాదు కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా కూడా పేర్కొంది సీబీఐ. 41 సీఆర్పీసీ కింద నోటీసులు కూడా ఇచ్చింది.

Sat, 16 Mar 202404:21 AM IST

కవితను విచారించిన సీబీఐ

ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఈడీ, సీబీఐ పలుమార్లు నోటీసులను జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. 2022 డిసెంబర్ లో హైదరాబాద్ లో ని కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు… కవితను విచారించారు. దాదాపు 7 గంటలపాటు కవితను విచారించారు. సౌత్ గ్రూప్ కంట్రోలర్ గా మీరు ఉన్నారా?మీరు ఫోన్లు మార్చారా?సౌత్ గ్రూప్ గురించి మీకు తెలుసా? అందులో మీ పాత్ర ఉందా? వంటి పలు ప్రశ్నలను సీబీఐ సంధించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈడీ నుంచి కూడా నోటీసులు వచ్చాయి. స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఈ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అరెస్ట్ కాలేదు.

Sat, 16 Mar 202404:21 AM IST

అమిత్ ఆరోరో అరెస్ట్ - రిమాండ్ రిపోర్టులో కవిత పేరు

ఈ కేసులో అమిత్ ఆరోరోనా అరెస్ట్ చేసింది సీబీఐ. అయితే మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని విషయాన్ని సీబీఐ గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ(ED) కూడా ఎంట్రీ ఇచ్చింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్(South Group) చెల్లించినట్లు సీబీఐ తేల్చింది. సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్టుగా ఈడీ(ED) వెల్లడించింది. 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మెుబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో కవిత రెండు నెంబర్లు, పది మెుబైల్ ఫోన్ల్(Mobile Phones) వాటినట్టుగా పేర్కొంది. కవిత వాడిన పది ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.

Sat, 16 Mar 202404:20 AM IST

నిన్న రాత్రే ఢిల్లీకి తరలింపు

  • నిన్న త్రి 8 గంటల తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు కవిత.
  • రాత్రి 08.45 నిమిషాలకు ఈడీ బుక్ చేసిన ఫైట్ లో ఢిల్లీకి తరలించారు.
  • ఇవాళ ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టనుంది ఈడీ.
  • కవితను ఢిల్లీకి తరలించిన నేపథ్యంలో… కేటీఆర్ తో పాటు పలువురు నేతలు శుక్రవారం రాత్రే ఢిల్లీకి బయల్దేరారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.

Sat, 16 Mar 202404:20 AM IST

కవిత అరెస్ట్ పై ఈడీ ప్రకటన

  • PMLA(Prevention of Money Laundering Act) యాక్ట్‌ సెక్షన్‌ 19 కింద అరెస్ట్‌ చేసినట్లు ఈడీ తెలిపింది.
  • సాయంత్రం 6 గంటలకు 20 మంది అనుమతి లేకుండా లోపలికి వచ్చి తమతో వాగ్వాదానికి దిగారని ఈడీ పేర్కొంది.
  • ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో కవిత అరెస్ట్ కు సంబంధించి ప్రకటన విడుదలైంది.
  • అరెస్ట్‌ చేయడానికి గల కారణాలతో కూడిన 14 పేజీల కాపీని కవితకు అందజేసినట్లు ఈడీ తెలిపింది.

Sat, 16 Mar 202404:20 AM IST

నిన్న సాయంత్రం కవిత అరెస్ట్

  • మార్చి 15వ తేదీన 12 మందితో కూడా ఈడీ అధికారుల బృందం హైదరాబాద్ కు చేరుకుంది.
  • శుక్రవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ బంజారాహిల్స్ ని కవిత నివాసానికి చేరుకుంది.
  • కవిత నివాసంలో సోదాలు చేపట్టింది. మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సోదాలు జరిగినట్లు ఈడీ ఓ ప్రకటన విడుదల చేసింది.
  • కవిత నివాసానికి ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ చేరుకున్నారు. వారితో పాటు అడ్వొకేట్ సోమ భరత్ కూడా ఉన్నారు.
  • తొలుత వీరిని ఇంట్లోకి వెళ్లేందుకు ఈడీ అధికారులు అనుమతించలేదు. ఆ తర్వాత లోపలికి వెళ్లినట్లు తెలిసింది. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు.
  • శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు కవితను అరెస్ట్‌ చేసినట్లు ఈడీ వెల్లడించింది.

Sat, 16 Mar 202404:19 AM IST

గతంలో నోటీసులు, విచారణ

  • ఈ కేసుకు సంబంధిచి నోటీసులు అందుకున్నారు కవిత. 2022 డిసెంబర్ లో హైదరాబాద్ లో ని కవిత నివాసానికి సీబీఐ అధికారుల బృందం వచ్చింది… కవితను దాదాపు 7 గంటలపాటు కవితను విచారించారు.
  • ఆ తర్వాత ఈడీ(ED) నుంచి కూడా నోటీసులు వచ్చాయి. స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు(2023 మార్చి 11) కూడా హాజరయ్యారు కవిత. ఈ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అరెస్ట్ కాలేదు.
  • 2023లో మహిళల విచారణలో ఈడీ సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కొద్ది నెలలుగా విచారణ జరుగుతోంది.
  • కేసు విచారణ సాగుతుండగానే… మరోవైపు సీబీఐ, ఈడీ మరోసారి కవితకు నోటీసులు పంపాయి. ఈ కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా కూడా పేర్కొంది సీబీఐ. ఇటీవలే 41 సీఆర్పీసీ కింద నోటీసులు కూడా ఇచ్చింది. కానీ సీబీఐ విచారణకు హాజరుకాలేదు కవిత.

Sat, 16 Mar 202404:18 AM IST

2022లో వెలుగులోకి

-ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Scam Case) వ్యవహారం 2022లో వెలుగులోకి వచ్చింది.

-2021లో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ(Delhi Liquor Scam Case)లో అవకతవకలు జరిగాయని.. దీనిపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

-ఈ కేసును మొదటగా సీబీఐ విచారణ జరపగా… ఆ తర్వాత ఈడీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ కేసులో 2002లో అమిత్ ఆరోరోనా అరెస్ట్ చేసింది సీబీఐ. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఫోన్ల ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని పేర్కొంది.

Sat, 16 Mar 202404:13 AM IST

బీఆర్ఎస్ న్యాయపోరాటం

కవిత అరెస్ట్ ను సవాల్ చేస్తూ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు.

Sat, 16 Mar 202404:12 AM IST

కాసేపట్లో వైద్య పరీక్షలు

ఎమ్మె‍ల్సీ కవితకు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Sat, 16 Mar 202404:11 AM IST

ఉదయం 10.30 గంటలకు

ఇవాళ ఉదయం 10.30 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టనుంది ఈడీ. ఈరోజు కవితను తమ కస్టడీకి ఇవ్వాలని కోరనుంది.

Sat, 16 Mar 202404:05 AM IST

కవిత అరెస్ట్…

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. శుక్రవారం రాత్రే ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇవాళ రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది.