తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tpcc New Incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్.. ఠాగూర్ ప్లేస్ లో ఠాక్రే

TPCC New Incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్.. ఠాగూర్ ప్లేస్ లో ఠాక్రే

HT Telugu Desk HT Telugu

05 January 2023, 10:58 IST

google News
    • Telangana Congress New Incharge: తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జిగా మాణిక్‌రావు గోవిందరావు ఠాక్రే నియమితులయ్యారు.  ఇప్పటివరకు ఉన్న ఠాగూర్ కు గోవా బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్.
కొత్త ఇంఛార్జ్
కొత్త ఇంఛార్జ్

కొత్త ఇంఛార్జ్

Manikrao Govindrao Thakre: టీ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటల వేళ… ఆ పార్టీ హైకమాండ్ కీలక మార్పులు చేపట్టింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్ద్ గా ఉన్న ఠాగూర్ స్థానంలో కొత్త ఇంచార్జిని నియమించింది. మహారాష్ట్రకు చెందిన మాణిక్‌ రావు గోవింద్ ఠాక్రే(Manikrao Thakre)ను కొత్త ఇంఛార్జ్ గా నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్ హైకమాండ్.

ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌(Manickam Tagore)కు గోవా రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే.సీ. వేణుగోపాల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. కొత్త ఇంచార్జ్ గా వచ్చిన మాణిక్‌రావు గోవిందరావు ఠాక్రే.. మహారాష్ట్రకు చెందిన వారు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది. ధర్వా అసెంబ్లీ నియోజకవర్గంలో 1985 నుంచి 2004 వరకు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత 2009 నుంచి 2018 వరకు రెండు సార్లు ఎమ్మెల్సీగానూ సేవలందించారు. మూడు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఠాక్రేకు ఉంది. 2008 నుంచి 2015 వరకు ఏడేళ్ల పాటు మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

నిజానికి సీనియర్లంతా ఠాగూర్ తీరును వ్యతిరేకిస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి చేతిలో ఠాగూర్ కీలుబొమ్మలా మారారని ఆరోపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీ దూతగా వచ్చిన డిగ్గీ రాజాకు కూడా నేతలు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను తొలగించటం కీలక పరిణామంగా మారింది. కొత్త ఇంఛార్జ్ వచ్చిన నేపథ్యంలో పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడుతుందా..? సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా పని చేస్తారా..? రేవంత్ స్పీడ్ ఇలాగే కొనసాగుతుందా..? లేదా..? అనేది చూడాలి.

తదుపరి వ్యాసం