తెలుగు న్యూస్  /  Telangana  /  Cold Wave Increased In Telangana

Cold Wave in Telangana: పెరిగిన చలి తీవ్రత.. ఆ ప్రభావంతో మళ్లీ వర్షాలు!

HT Telugu Desk HT Telugu

29 October 2022, 7:58 IST

    • Telangana Weather Updates: తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. శీతాకాలం ప్రారంభంలోనే వణుకు పుట్టిస్తోంది. అక్టోబర్ లో పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Cold Wave Increased in Telangana: వర్షాకాలం(Rain Season) ముగియడంతో రాష్ట్రంలో క్రమంగా చలి పెరుగుతోంది. నవంబర్ ప్రారంభంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ(IMD) అధికారులు భావిస్తున్నారు. అయితే అక్టోబర్ చివరి వారంలోనే చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటలు కూడా కాకుండానే.. చలి పెరుగుతోంది. ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో శీతల గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం పూట పొడి వాతావరణం ఉంటుందని వాతారణశాఖ పేర్కొంది. రాత్రివేళల్లో చలి వాతావరణం ఉంటుందని తెలిపింది. మరోవైపు శుక్రవారం పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరంభీం జిల్లా సిర్పూరులో 12.5 డిగ్రీలు, మెదక్‌లో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

Northeast Monsoon Rains : ఈశాన్య రుతుపవనాలపై వాతారణ శాఖ ప్రకటన చేసింది. ఈనెల 29న ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడును అక్టోబర్‌ 20 లేదా అంతకు రెండు రోజులు అటుఇటుగా తాకుతాయి. కానీ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈ నెల 23 వరకు పూర్తి కాలేదు. మరోవైపు సిత్రాంగ్ తుపాన్ ప్రభావం కూడా... ఈశాన్య రుతుపవనాల ఆలస్యానికి కారణమైందని చెప్పొచ్చు.

అక్టోబరు 29, 30 తేదీలలో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమ, కేరళ ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ప‌లు చోట్ల ఉరుములు మెరుపుల‌తో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు పడడం లేదు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబరు 31న రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబరు 1న కొన్నిజిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలింది.

టాపిక్