Northeast Monsoon: 29న ఈశాన్య రుతుపవనాల రాక.. APకి భారీ వర్ష సూచన!
northeast monsoon rains: ఈనెల 29న ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ నెల 23నే నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి.
Northeast Monsoon Rains in AP: ఈశాన్య రుతుపవనాలపై వాతారణ శాఖ ప్రకటన చేసింది. ఈనెల 29న ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడును అక్టోబర్ 20 లేదా అంతకు రెండు రోజులు అటుఇటుగా తాకుతాయి. కానీ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈ నెల 23 వరకు పూర్తి కాలేదు. మరోవైపు సిత్రాంగ్ తుపాన్ ప్రభావం కూడా... ఈశాన్య రుతుపవనాల ఆలస్యానికి కారణమైందని చెప్పొచ్చు.
ఈశాన్య రుతుపవనాలపై వాతారణ శాఖ ప్రకటన చేసింది. ఈనెల 29న ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడును అక్టోబర్ 20 లేదా అంతకు రెండు రోజులు అటుఇటుగా తాకుతాయి. కానీ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈ నెల 23 వరకు పూర్తి కాలేదు. మరోవైపు సిత్రాంగ్ తుపాన్ ప్రభావం కూడా... ఈశాన్య రుతుపవనాల ఆలస్యానికి కారణమైందని చెప్పొచ్చు.
ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఇదే సమయంలో నైరుతి బంగాళాఖాతం నుంచి దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో దక్షిణాదిపైకి ఈశాన్య గాలులు వీయనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
అక్టోబరు 29, 30 తేదీలలో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమ, కేరళ ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ఆదివారం దేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. దీంతో ఈశాన్య రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనట్లు ఐఎండీ వివరించింది.నైరుతి రుతుపవనాల సీజన్‌లో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలోనే బంగాళాఖాతంలో తపానులు ఎక్కువగా ఏర్పడతాయి.
టాపిక్