తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bl Santhosh Comments: వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు.. ఎర కేసుపై Bl సంతోష్ కీలక వ్యాఖ్యలు

BL Santhosh Comments: వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు.. ఎర కేసుపై BL సంతోష్ కీలక వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu

29 December 2022, 19:06 IST

    • bl santhosh reaction on mlas poaching case: సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసుపై బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని కామెంట్స్ చేశారు.
అసెంబ్లీ ఇన్‌ఛార్జి, విస్తారక్‌, పాలక్‌, కన్వీనర్ల భేటీలో  బీఎల్ సంతోష్
అసెంబ్లీ ఇన్‌ఛార్జి, విస్తారక్‌, పాలక్‌, కన్వీనర్ల భేటీలో బీఎల్ సంతోష్ (twitter)

అసెంబ్లీ ఇన్‌ఛార్జి, విస్తారక్‌, పాలక్‌, కన్వీనర్ల భేటీలో బీఎల్ సంతోష్

BJP Leader BL santhosh Comments on MLAs Poaching Case: BL సంతోష్.... గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తెగ వినిపిస్తున్న పేరు..! ఆయన ఏం చేస్తారు..? బీజేపీలో ఆయన రోల్ ఏంటీ..? టాప్ లీడర్లలో ఆయన ఒకరా..? ఇలా అనేక అంశాలు చర్చకు కూడా వచ్చాయి. కారణం.. సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు..! ఈ కేసు తెర వెనక నడిపించింది అంతా ఆయనే అనేది బీఆర్ఎస్ ఆరోపణ..! సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కూడా ఆ కోణంలోనే చూస్తోంది. ఆయన్ను విచారించాలని నోటీసులు పంపినప్పటికీ సంతోష్ రాలేదు. పైగా హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఈ క్రమంలో... ఆయన హైదరాబాద్ వచ్చారు. గురువారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో జరుగుతున్న బీజేపీ అసెంబ్లీ ఇన్‌ఛార్జి, విస్తారక్‌, పాలక్‌, కన్వీనర్ల భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

ఎమ్మెల్యేల ఎర కేసులో తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని సంతోష్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం , నాయకులు ప్రజాస్వామ్యానికి శాపంగా మారారని మండిపడ్డారు. హైదరాబాద్‌ సంపదను రాజకీయాల కోసం దేశమంతా పంచుతున్నారని... తెలంగాణ తల్లికి ఆ పార్టీ నేతలు ద్రోహం చేశారని దుయ్యబట్టారు. ప్రజలకు తాను తెలియకపోయినా ప్రతి ఇంటికి తన పేరు తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు జాతీయ నాయకత్వం అప్పగించిన బాధ్యతలను చిత్త శుద్ధితో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఎల్ సంతోష్ పేరు ప్రధానంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ కేసుపై గానీ, సిట్ నోటీసుల విషయంపై గానీ స్పందిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చిన ఆయన... స్పందించారు. పరోక్షంగా బీఆర్ఎస్ సర్కార్ కు గట్టి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలోనే అన్నింటికి సరైన సమాధానం చెబుతానంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ విషయంలో ఏర్పాటు చేసిన సిట్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ క్రమంలో సీబీఐ ఏంట్రీ ఇవ్వబోతుంది. మరోవైపు హైకోర్టు తీర్పును అప్పీల్ చేయాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్. ఒకవేళ అదే జరిగితే డివిజన్ బెంజ్ ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కూడా అత్యంత ఆసక్తికరంగా మారుతుంది.