MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించిన సిట్-mlas poaching case sit officials submitted counter in high court ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Mlas Poaching Case Sit Officials Submitted Counter In High Court

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించిన సిట్

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 10:25 PM IST

MLAs Poaching Case Update : ఎమ్మెల్యేలకు ఎర కేసును సిట్ అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు (HT_PRINT)

ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు(High Court)కు కీలక ఆధారాలను సిట్(SIT) సమర్పించింది. నిందితుడు రామచంద్రభారతితో బీజేపీ నేత బీఎల్ సంతోష్(BL Santhosh Kumar) వాట్సాప్ చాట్ ఉన్నట్టుగా పేర్కొంది. రామచంద్రభారతి మెసేజ్ కు బీఎల్ సంతోష్ రిప్లై ఇచ్చినట్టుగా తెలిపింది. నిందితులతో ఫోన్ సంభాషణలు కూడా ఉన్నట్టుగా కోర్టుకు తెలిపింది. కాల్ డేటా వివరాలు హైకోర్టుకు ఇచ్చింది. ఢిల్లీ(Delhi) పెద్దలతో ముగ్గురు నిందితుల ఫోటోలు కూడా కోర్టుకు సమర్పించింది సిట్.

ట్రెండింగ్ వార్తలు

రామచంద్ర భారతి, సింహయాజి, నందులతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడిపినట్టు పక్కా ఆధారాలు సిట్ సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై హైకోర్టు(High Court)లో కౌంటర్ సమర్పించారు. ఇందులో ఇప్పటి వరకూ లేని పేర్లు కూడా.. అధికారులు ప్రస్తావించారు. నోటీసులు అందుకున్న వారి జాబితా వివరాలను కూడా పేర్కొన్నారు.

ఇప్పటికే.. 41ఏ సీఆర్‌పీసీ కింద పలువురు నోటీసులు అందుకున్నారు. నిందితుల కాల్ డేటా(Call Data)పైనా.. సిట్ కీలక ఆధారాలను రాబట్టింది. అనుమానితుల కాల్ డేటాను కూడా కోర్టుకు సిట్ సమర్పించింది. పెద్ద పెద్ద నేతలతో నిందితులు దిగిన ఫొటోలు.. అంతేకాకుండా వారు ప్రయాణించిన విమాన టికెట్లు వివరాలను అధికారులు సేకరించారు.

సిట్ సమర్పించిన వివరాల్లో.. నలుగురు నిందితుల వాట్సాప్ చాట్(Whats App Chat), ముగ్గురు కాల్ డేటా వివరాలను అధికారులు సమర్పించారు. నందు, రామచంద్ర భారతి, సింహయాజీ సంభాషల ఆధారాలు సేకరించి.. బీఎల్ సంతోష్ వాట్సాప్ చాట్ ను కూడా కోర్టుకు సమర్పించారు. అనుమానితులకు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నట్టుగా అధికారులు కోర్టుకు తెలిపారు.

ఈ ఆడియో టేప్స్(Audio Tape) లో వెలుగులోకి వచ్చిన వ్యక్తులపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిట్ కోర్టుకు తెలిపింది. కోదండరామ్ తోపాటుగా కాంగ్రెస్(Congress) నేతలు దామోదర ప్రసాద్, ముంజగల్ల విజయ్ ను బీజేపీలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని.. సిట్ అధికారులు కౌంటర్లో పేర్కొన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం