తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Telangana : ఎంపీ సీట్లపై గురి...! 'రథయాత్ర'కు సిద్ధమవుతున్న బీజేపీ

BJP Telangana : ఎంపీ సీట్లపై గురి...! 'రథయాత్ర'కు సిద్ధమవుతున్న బీజేపీ

02 February 2024, 16:26 IST

google News
    • BJP Telangana Rath Yatra: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది బీజేపీ తెలంగాణ(BJP Telangana Party) నాయకత్వం. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా రథయాత్రను చేపట్టబోతుంది. 
బీజేపీ తెలంగాణ
బీజేపీ తెలంగాణ (BJP Party)

బీజేపీ తెలంగాణ

BJP Telangana Rath Yatra 2024: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది బీజేపీ తెలంగాణ. ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవటంతో… వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 4 ఎంపీ స్థానాలను గెలిచి సత్తా చాటింది కాషాయదళం. అయితే ఈసారి మాత్రం… రెండంకెల సంఖ్యను దాటాలని చూస్తోంది. అందుకు తగ్గట్టే కార్యాచరణను రూపొందించి… ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.

రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర…!

పార్లమెంట్ ఎన్నికలు సమీపించిన వేళ రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర(BJP Telangana Rath Yatra)ను చేపట్టేందుకు సిద్ధమైంది బీజేపీ తెలంగాణ నాయకత్వం. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. రాష్టంలోని 119 నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ యాత్రను చేపట్టనున్నట్లు పార్టీ వర్గాల మేరకు తెలిసింది. ఇటీవలే జరిగిన పార్టీ సమావేశంలో ఈ యాత్రపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రం మొత్తం కవర్ అయ్యేలా 5 క్లస్టర్లుగా విభజించి… యాత్ర సాగేలా చూస్తోంది. పార్టీ సీనియర్ నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు.

మెజార్టీ సీట్లే లక్ష్యం….

2019 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ 4 సీట్లను గెలుచుకోవాలని సరికొత్త చరిత్ర సృష్టించింది. నిజానికి 2018 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ… ఆరు నెలల వ్యవధిలోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే సత్తా చాటింది. ప్రధాన పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు గట్టి షాక్ ఇచ్చింది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఓటింగ్ శాతం కూడా పెంచుకుంది. ఈ నేపథ్యంలో…. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే కుండా ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో గతంలో నిలబడ్డిన సిట్టింగ్ ఎంపీలతో పాటు కీలక నేతలను బరిలో ఉంచేలా కేంద్ర నాయకత్వం కూడా కసరత్తు చేస్తోంది.

గత నెలలోనే అమిత్ షా తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో టూర్ రద్దు అయింది. ఒకేరోజు మూడు జిల్లాల్లో సమావేశాలు ఖరారైనప్పటికీ… అమిత్ షా టూర్ క్యాన్సిల్ అయింది. త్వరలోనే మళ్లీ అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. పలు పార్లమెంట్ సెగ్మెంట్ల నేతలతో సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

ఈసారి దక్షిణాది నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను ఆశిస్తున్న బీజేపీ… తెలంగాణపై భారీగానే ఆశలు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. గత ఫలితాల దృష్ట్యా…ఈసారి మరింత కష్టపడితే సీట్ల సంఖ్య పెరగవచ్చని లెక్కలు వేసుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా…. ప్రధాని మోదీ పర్యటనలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం